Andhra Pradesh: వామ్మో..! స్కూటీలో దూరిన కట్లపాము.. కాటేయబోయే సరికే..

Visakhapatnam: జీవవైవిద్యంలో భాగమైన పాములకు హాని చేయకూడదని కొంతమంది అవగాహన పెంచుతూ ఎక్కడ పాము కనిపించినా దాని పట్టుకుని అడవుల్లోకి విడిచి పెట్టేస్తున్నారు. అయితే.. తాజాగా స్టీల్ ప్లాంట్ సెక్టర్ లో ఓ స్కూటీ లో కట్లపాము కలకలం రేపింది. సర్రున స్కూటీలో దూరిపోయి కనిపించకుండా పోయింది. స్కూటీని టచ్ చేస్తే కాటేస్తుందేననే భయం. అలా వదిలేస్తే ఏ సమయంలో ఎవరికీ హాని పడుతుందోనని ఆందోళన. దాంతో..

Andhra Pradesh: వామ్మో..! స్కూటీలో దూరిన కట్లపాము.. కాటేయబోయే సరికే..
Snake In Scooty
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 30, 2023 | 8:24 PM

విశాఖపట్నం, సెప్టెంబర్30: భిన్నమైన భౌగోళిక పరిస్థితులు ఉన్న విశాఖలో నిత్యం ఎక్కడో చోట పాములు కలకలం సృష్టిస్తున్నాయి. పొదలు, పుట్ల నుంచి కాస్త జనావాసాల వైపు వచ్చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ వైపు పొదలు ఎక్కువగా ఉండటంతో సాధారణంగా అక్కడ పాముల సంచారం ఎక్కువగానే ఉంటుంది. కొంతమంది పామును చూడగానే భయపడి పారిపోతూ ఉంటే.. మరికొంతమంది అది కాటేస్తుందని భయంతో వాటిని ప్రాణాలు తీసేస్తున్నారు. అయితే జీవవైవిద్యంలో భాగమైన పాములకు హాని చేయకూడదని కొంతమంది అవగాహన పెంచుతూ ఎక్కడ పాము కనిపించినా దాని పట్టుకుని అడవుల్లోకి విడిచి పెట్టేస్తున్నారు. అయితే.. తాజాగా స్టీల్ ప్లాంట్ సెక్టర్ లో ఓ స్కూటీ లో కట్లపాము కలకలం రేపింది. సర్రున స్కూటీలో దూరిపోయి కనిపించకుండా పోయింది. స్కూటీని టచ్ చేస్తే కాటేస్తుందేననే భయం. అలా వదిలేస్తే ఏ సమయంలో ఎవరికీ హాని పడుతుందోనని ఆందోళన. ఆ తర్వాత అరగంటకు అంతా ఊపిరి పీల్చుకున్నారు..

– స్టీల్ ప్లాంట్ సెక్టర్ క్వార్ట ర్స్ లో ఇంటి ముందు స్కూటీ పార్క్ చేసి లోపలికి వెళ్లారు. కాసేపటికి పొదల్లోంచి వచ్చిన ఓ కట్లపాము పిల్ల.. రయ్యిన వచ్చేసింది. రెప్పపాటులో వచ్చి స్కూటీలో దూరింది. దాన్ని ఓ వ్యక్తి చూసి.. వాహనదారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో తీవ్ర భయాందోళన గురైన వాళ్లంతా.. వచ్చి చూశారు. కానీ ఎక్కడ ఆ పాము కనిపించలేదు. మళ్లీ ఎక్కడికో వెళ్లిపోయిందిలే అనుకున్నారు. ఇంతలోనో ఒక్కసారిగా లోపలి నుంచి తొమ్మిది చూస్తుంది. స్కూటీ ఇంజన్ దగ్గర ఒకసారి… హ్యాండిల్ దగ్గర మరోసారి.. డిక్కీ దగ్గర ఇంకోసారి తిరుగుతూ హల్చల్ చేసింది. ఒక్కోసారి కనిపించకుండా పోయి కంగారు పెట్టించింది. కాసేపటి వరకు కనిపించకపోయేసరికి.. వెళ్ళిపోయి ఉంటుందని అనుకున్నారు. కానీ స్కూటీని టచ్ చేయాలంటే భయం. ఎందుకంటే ఒక్కసారిగా వచ్చి కాటేస్తే..?!

– తీవ్ర భయాందోళనలు చెందిన స్థానికులంతా.. స్నేక్ క్యాచర్ కిరణ్ కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన కిరణ్.. స్కూటీ అంతా వెతికాడు. కానీ ఎక్కడ కనిపించకుండా లోపల దాక్కున్నట్టు ఉండిపోయింది ఆ కట్లపాము. పరిమాణం చిన్న సైజులో ఉండడంతో.. దాన్ని గుర్తించడం కాస్త కష్టతరమైంది. చివరకు స్కూటీని కిందకు వాల్చి.. చూసేసరికి ఇంజన్ కింద భాగంలో ఆ పాము కనిపించింది. మెల్లగా చేయి పెట్టి మెల్లగా బయటకు తీశాడు స్నేక్ క్యాచర్. కట్లపాము పిల్లే అయినప్పటికీ.. అది చాలా చురుగ్గా కదులుతున్నడంతో.. చాకచక్యంగా వ్యవహరించాల్సి వచ్చిందని అంటున్నాడు కిరణ్. దీంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..