Watch Viral Video: అయ్యో.. కదులుతున్న రైలు ఎక్కబోయి ఇరుక్కున్న యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

లు వెళ్లేంత వరకు అతడిని కదలకుండా అక్కడే నక్కి కూర్చోమని సలహా ఇచ్చారు. ట్రాక్‌పై నేరుగా పడుకోమని మార్గనిర్దేశం చేశారు. పోలీస్‌ అధికారి సూచనలను పాటించి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే ఈ ఘటనలో 24 ఏళ్ల యువకుడు స్వల్పంగా గాయపడ్డాడు. నివేదిక ప్రకారం, ప్రథమ చికిత్స అందించిన తర్వాత చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Watch Viral Video: అయ్యో.. కదులుతున్న రైలు ఎక్కబోయి ఇరుక్కున్న యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
Man Miraculously Escapes
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 30, 2023 | 8:07 PM

కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి రైలు పట్టాలపై పడిపోయిన వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. నిజంగా ఇది మిరాకిల్‌ అనే చెప్పాలి.. ఎందుకంటే.. పెను ప్రమాదం నుండి అతడు అద్భుతంగా బయటపడ్డాడు. రైలు స్టేషన్ నుండి వెళ్లిపోయిన వెంటనే అతడు క్షేమంగా లేచి నిలబడ్డాడు. జరిగిన ఘటనపై పోలీసులు ఆరా తీశారు. ఈ షాకింగ్‌ ఘటన బీహార్‌లోని బగాహ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి రైలుకు, ప్లాట్‌ఫారానికి మధ్య ఉన్న గ్యాప్‌లో పడిపోయాడు. రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఆ వ్యక్తి రైలు పట్టాలపైకి దిగినట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. సంఘటనా స్థలంలో ఉన్న పోలీసు అధికారి ఈ విషయాన్ని గమనించి అతనికి సాయం చేశారు.

రైలు పట్టాలపై పడిన వ్యక్తిని బీహార్‌లోని బెట్టియాలోని ఉత్తరవారీ పోఖారా ప్రాంతంలో నివసించే 24 ఏళ్ల ప్రతీక్ కుమార్‌గా గుర్తించారు. రైల్లో ప్రయాణిస్తున్న అతడు.. స్నాక్స్‌ కోసం రైలు దిగిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. అతను తిరిగి వచ్చే సమయానికి, రైలు స్టేషన్ నుండి బయలుదేరడం ప్రారంభించింది. దాంతో అతడు ఏదో ఒక కోచ్‌లోకి ఎక్కేయాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఊహించని విధంగా అతడు ప్రమాదానికి గురయ్యాడు.

ఇవి కూడా చదవండి

కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా అతడు కాలు జారి రైలు, ప్లాట్‌ఫామ్‌కి మధ్యలో పడిపోయాడు. అక్కడే స్టేషన్‌లో డ్యూటీలో ఉన్న GRP, ఇతర ప్రయాణీకులు అతనికి సహాయం చేయడానికి, ముందుకు వచ్చారు. కానీ, రైలు అప్పటికే బయలుదేరింది.. రైలు వెళ్లేంత వరకు అతడిని కదలకుండా అక్కడే నక్కి కూర్చోమని సలహా ఇచ్చారు. ట్రాక్‌పై నేరుగా పడుకోమని మార్గనిర్దేశం చేశారు. పోలీస్‌ అధికారి సూచనలను పాటించి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే ఈ ఘటనలో 24 ఏళ్ల యువకుడు స్వల్పంగా గాయపడ్డాడు. నివేదిక ప్రకారం, ప్రథమ చికిత్స అందించిన తర్వాత చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తమ స్పందన తెలియజేశారు. గురుడికి ఇంకా ఈ భూమిపై నూకలు మిగిలే ఉన్నాయ్‌.. అందుకే అంతపెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుని క్షేమంగా బయటపడ్డాడు అని అంటున్నారు. మరికొందరు అతడు మృత్యుంజయుడు అంటున్నారు. ఇంకొందరు.. అతడి అదృష్టం బాగుంది..అంటూ కామెంట్‌ చేశారు. ఇలా చాలా మంది నెటిజన్లు వీడియోపై తమ అభిప్రాయాలను తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..