AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ప్రపంచంలోనే అతి పొడవైన జుట్టున్న వ్యక్తిగా గిన్నిస్‌ రికార్డ్‌.. ఇంతకీ ఈ ఫొటోలో ఉంది..

ఫొటో చూడగానే మొదట అమ్మాయే అనుకున్నారు కదూ. ! కానీ అతి పొడవైన జుట్టున్న పురుషుడిగా సిదక్‌దీప్‌ సింగ్ చాహల్‌ అరుదైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రపచంలోనే అతి పొడవైన జుట్టున్న కుర్రాడిగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ 2024లో చోటు సంపాదించుకున్నాడు. ఈ విషయాన్ని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు సిదక్‌దీప్ సింగ్ చాహల్‌కు సంబంధించిన ఓ వీడియోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..

Viral News: ప్రపంచంలోనే అతి పొడవైన జుట్టున్న వ్యక్తిగా గిన్నిస్‌ రికార్డ్‌.. ఇంతకీ ఈ ఫొటోలో ఉంది..
Guinness World Record
Narender Vaitla
|

Updated on: Sep 30, 2023 | 5:58 PM

Share

Guinness world record: కాదేదీ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌కు అనర్హం అన్నట్లు ఉంటుంది. వెంట్రుకల నుంచి చేతి గోళ్ల వరకు అన్ని విషయాల్లోనూ అరుదైన గుర్తింపు సంపాదించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి జాబితాలోకి వస్తాడు 15 ఏళ్ల సిదక్‌దీప్‌ సింగ్ చాహల్‌. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఇయన జీవితంలో ఇప్పటి వరకు తన జుట్టును కత్తిరించుకోకపోవడం విశేషం. అదే ఇప్పుడు సిదక్‌దీప్‌కు అరుదైన గుర్తింపును తెచ్చి పెట్టింది.

ఫొటో చూడగానే మొదట అమ్మాయే అనుకున్నారు కదూ. ! కానీ అతి పొడవైన జుట్టున్న పురుషుడిగా సిదక్‌దీప్‌ సింగ్ చాహల్‌ అరుదైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రపచంలోనే అతి పొడవైన జుట్టున్న కుర్రాడిగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ 2024లో చోటు సంపాదించుకున్నాడు. ఈ విషయాన్ని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు సిదక్‌దీప్ సింగ్ చాహల్‌కు సంబంధించిన ఓ వీడియోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..

సిదక్‌ దీప్ సింగ్ జుట్టు ఇంతలా పెరగడం వెనకా ఎంతో కృషి ఉందంటే నమ్ముతారా.?ఈయన వారానికి రెండుసార్లు జుట్టును శుభ్రం చేస్తాడు. సిదక్‌ దీప్‌ సింగ్ జుట్టును వాష్ చేసుకోవడానికి ఏకంగా గంట సమయం పడుతుంది. సిక్కు మత సంప్రదాయాలను పాటించే సిదక్‌దీప్‌ చిన్నప్పటి నుంచి జుట్టు కత్తిరించలేదు. ఇలా 15 ఏళ్ల నుంచి సిదక్‌ దీప్‌ సింగ్ ఒక్కసారి కూడా కటింగ్ చేయించకపోవడం గమనార్హం. దీంతో 15 ఏళ్లలో అతడి జుట్టు ఏకంగా 146 సెంటీమీటర్లు పెరిగింది. గిన్నిస్‌ రికార్డులో చోటు దక్కించుకోవడం పట్ల సిదక్‌దీప్‌ సింగ్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తనకు అసలు చిన్ననాటి నుంచి జుట్టు అంటే ఇష్టం లేదని, అయితే ఇప్పుడు అదే జుట్టు తనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పుకొచ్చాడు.

ఇక తన జుట్టుకు అరుదైన గుర్తింపు రావడంపై స్పందించిన సిదక్‌ దీప్‌ సింగ్‌.. చిన్నప్పుడు తన జుట్టు చూసి స్నేహితులు ఏడిపించే వారంటా, దీంతో జుట్టు కత్తిరించుంటానని గొడవ చేశానని, కానీ తర్వాత తనకు జుట్టుపై ఇష్టం పెరిగిందని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు జుట్టు తన జీవితంలో ఒక భాగమైందని, జుట్టు వల్ల రికార్డు వచ్చిందని చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదని తెలిపారు. ఇక జుట్టు పెంచుకోవడం అంత సులభమైన విషయం కాదంటున్న సిదక్‌ దీప్‌ సింగ్‌.. వారానికి రెండు సార్లు తల స్నానం చేస్తానని, అందుకు కనీసం గంట సమయం పడుతుందని చెప్పుకొచ్చాడు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..