Agency Problems: డోలితో కలెక్టర్ చెంతకు.. అది చూసిన వెంటనే..!

Agency Problems: డోలితో కలెక్టర్ చెంతకు.. అది చూసిన వెంటనే..!

Anil kumar poka

|

Updated on: Oct 01, 2023 | 2:22 PM

వాళ్లంతా అడవి బిడ్డలు..! కొండ శిఖర గ్రామాల్లో నివసించే వీళ్ళ జనాభా 300లకు మించదు. అక్కడి పిల్లలకు పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని ఆశ. కానీ స్కూలుకు వెళ్లలేదు. ఎందుకంటే కిలోమీటర్ల కొద్దీ రాళ్లు రప్పల మీదుగా నడక సాగించాల్సిందే. దీంతో వాళ్లంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. అంగన్వాడి సెంటర్ లేక.. పోషకాహారం అందక చిన్నారులు అల్లాడిపోతున్నారు. పోనీ కనీస సౌకర్యాలు అయిన కరెంటు, తాగునీరు ఉందా అంటే అదీ లేదు.

వాళ్లంతా అడవి బిడ్డలు..! కొండ శిఖర గ్రామాల్లో నివసించే వీళ్ళ జనాభా 300లకు మించదు. అక్కడి పిల్లలకు పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని ఆశ. కానీ స్కూలుకు వెళ్లలేదు. ఎందుకంటే కిలోమీటర్ల కొద్దీ రాళ్లు రప్పల మీదుగా నడక సాగించాల్సిందే. దీంతో వాళ్లంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. అంగన్వాడి సెంటర్ లేక.. పోషకాహారం అందక చిన్నారులు అల్లాడిపోతున్నారు. పోనీ కనీస సౌకర్యాలు అయిన కరెంటు, తాగునీరు ఉందా అంటే అదీ లేదు. ఇప్పటికీ వాళ్లకు ఓటు హక్కు లేదంటే నమ్ముతారా? కనిపించిన ప్రజాప్రతినిధికి గోడు వెళ్లబోసుకున్నారు.. అధికారుల చుట్టూ తిరిగారు.. కార్యాలయాలకు వెళ్లారు.. కానీ పని పూర్తి కాలేదు. చివరకు ఏకంగా డోలి కట్టి.. జిల్లా కలెక్టర్ చెంతకే వెళ్లారు. మా గోడు వినండి మహాప్రభో అంటూ వేడుకున్నారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని కొండ శిఖర లో లోసింగి, కొత్త లోసింగి, పెద్దగరువు, పిత్రి గడ్డ గ్రామాలున్నాయి. కనీస వసతులు లేకపోవడంతో పోరుబాటకు సిద్ధమయ్యారు గిరిజన బిడ్డలు. బాధితులంతా ఏకమై.. కలెక్టర్ చెంతకు వెళ్లారు. డోలి కట్టి తమ కష్టాలను వివరించే ప్రయత్నం చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి.. రోలుగుంట ప్రత్యేక అధికారికి ఆదేశాలు ఇచ్చారు. గిరిజనులు సమర్పించిన పత్రాల పై సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. తమ గోడు సానుకూలంగా విన్న.. జిల్లా కలెక్టర్‌ను తమ గ్రామాన్ని సందర్శించాలని ఆహ్వానించారు. త్వరలో ఆయా గ్రామాల్లో పర్యటిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారన్నారు గిరిజన సంఘం నాయకులు. కనీసం అప్పుడైనా తమ కష్టాలు తీరుతాయని ఆశపడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..