92 ఏళ్ల వయసులో పలక-బలపంతో బడికి..! చదువు కోవడానికి వయసుతో పనేంటని ప్రశ్నిస్తోన్న బామ్మ
ఆ అవ్వ వయసు 92 ఏళ్లు. తన జీవితంలో చదువుకోవాలని, చక్కగా రాయాలి అనే కల మొన్నటి వరకు కలగానే మిగిలిపోతుందనే అనుకుంది. కానీ చదువుకు వయసుతో పనేంటి? అనే నానుడిని నిజం చేయాలని అనుకుంది. అంతే పలకా బలపం పట్టి స్కూల్‌కు వెళ్లింది. ఈ విచిత్ర సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో బుధవారం (సెప్టెంబర్ 27) వెలుగు చూసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులందర్‌షహర్‌కు చెందిన సలీమా 1931లో జన్మించారు. 14 ఏళ్ల వయసులోనే వివాహం జరిగి సంసార బాధ్యతల్లో..
లక్నో, అక్టోబర్ 1: ఆ అవ్వ వయసు 92 ఏళ్లు. తన జీవితంలో చదువుకోవాలని, చక్కగా రాయాలి అనే కల మొన్నటి వరకు కలగానే మిగిలిపోతుందనే అనుకుంది. కానీ చదువుకు వయసుతో పనేంటి? అనే నానుడిని నిజం చేయాలని అనుకుంది. అంతే పలకా బలపం పట్టి స్కూల్‌కు వెళ్లింది. ఈ విచిత్ర సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో బుధవారం (సెప్టెంబర్ 27) వెలుగు చూసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులందర్‌షహర్‌కు చెందిన సలీమా 1931లో జన్మించారు. 14 ఏళ్ల వయసులోనే వివాహం జరిగి సంసార బాధ్యతల్లో మునిగిపోయారు. తమ ఊరిలో బడి సౌకర్యం లేకపోవడం, రకరకాల పరిస్థితుల వల్ల చదువుకునే అవకాశం చిన్నతనంలో ఆమెకు దొరకలేదు. దీంతో ఆరు నెలల క్రితం తన కంటే దాదాపు 8 దశాబ్ధాలు చిన్న వారైన విద్యార్ధులతో కలిసి స్కూల్‌కు వెళ్లడం ప్రారంభించారు. ఇలా చదవడం, రాయడం నేర్చుకుంది. ఈ క్రమంలో ఒకటి నుంచి వంద వరకు అంకెలను లెక్కిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ బామ్మ కథ వెలుగు చూసింది.
‘నేను కూడా చదవగలుగుతున్నాను. రాయగలుగుతున్నాను. డబ్బు లెక్కపెట్టగలుగుతున్నాను. నా మనవలు డబ్బు తక్కువ ఇచ్చి నన్ను మోసం చేసేవారు. కానీ ఇప్పుడు నేను అన్నీ చదవగలుగుతున్నాను. నా సంతోషాన్ని చెప్పడానికి మాటలు సరిపోవడం లేదంటూ సలీమాఖాన్ మీడియాకు తెలిపారు. చదువుకు వయసుతో సంబంధం లేదనే వాస్తవాన్ని సలీమాఖాన్ కథ మరోమారు ప్రపంచానికి చాటిచెప్పింది. విద్యా వాలంటీర్ల చొరవతో సలీమాఖాన్ పాఠశాలకు వెళ్లి చదవగలిగినట్లు తెలుస్తోంది.
స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభా శర్మ మాట్లాడుతూ.. ‘మొదట్లో సలీమాఖాన్‌కు చదువు చెప్పడానికి టీచర్‌లు తటపటాయించారు. అయితే ఆమెలో చదువుకోవాలనే అభిరుచి వారిలోని సంకోచాన్ని దూరం చేసింది. ఆమెను తిరస్కరించడానికి మాకు మనస్కరించలేదు. ఆమెను వద్దనడానికి మాకు ఏ కారణం కనిపించలేదు. ఆమె పట్టుదల చూసి టీచర్లకు సైతం ఉత్సాహం వచ్చింది. చదువుకోవాలనే ఆమె పట్టుదల టీచర్‌లకు బాగా నచ్చిందని ప్రతిభ శర్మ చెప్పుకొచ్చారు. సలీమాఖాన్ స్కూల్‌కు వెళ్లడం ప్రారంభించడంతో అదే గ్రామానికి చెందిన మరో 25 మంది మహిళలు కూడా చదువుకోవడానికి స్కూల్‌కు వెళ్లడం మొదలుపెట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.