Crime: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఓ పోలీసు, లాయరు చేసిన పనికి.. కోట్లు ఆస్తి ఖల్లాస్.

Crime: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఓ పోలీసు, లాయరు చేసిన పనికి.. కోట్లు ఆస్తి ఖల్లాస్.

Anil kumar poka

|

Updated on: Oct 01, 2023 | 8:45 AM

ఎవరికైనా అన్యాయం జరిగితే పోలీసులు, లాయర్లను ఆశ్రయిస్తారు. కానీ వాళ్లే ప్రజలను మోసం చేస్తే ఇంకెవరి దగ్గరకు వెళ్లాలి. తాజాగా చట్టాన్ని కాపాడేందుకు పోరాడాల్సిన ఓ లాయరు, అదే చట్టాన్ని పరిరక్షించాల్సిన మరో పోలీసు కలిసి ఓ ఎన్నారై కి చెందిన కోట్ల ఆస్తిని కొట్టేయాలని చూసారు. నకిలీ దస్తావేజులు, ఫోర్జరీ సంతకాలతో భూమి కొట్టేయాలనుకున్నారు. చివరికి భూ యజమాని ఫిర్యాదుతో కటకటాలు లెక్కిస్తున్నారు.

ఎవరికైనా అన్యాయం జరిగితే పోలీసులు, లాయర్లను ఆశ్రయిస్తారు. కానీ వాళ్లే ప్రజలను మోసం చేస్తే ఇంకెవరి దగ్గరకు వెళ్లాలి. తాజాగా చట్టాన్ని కాపాడేందుకు పోరాడాల్సిన ఓ లాయరు, అదే చట్టాన్ని పరిరక్షించాల్సిన మరో పోలీసు కలిసి ఓ ఎన్నారై కి చెందిన కోట్ల ఆస్తిని కొట్టేయాలని చూసారు. నకిలీ దస్తావేజులు, ఫోర్జరీ సంతకాలతో భూమి కొట్టేయాలనుకున్నారు. చివరికి భూ యజమాని ఫిర్యాదుతో కటకటాలు లెక్కిస్తున్నారు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానాలోని గురుగ్రామ్‌లో తొడాపూర్‌కు చెందిన సుభాష్‌ చంద్‌ అతడి అల్లుడు, న్యాయవాది అయిన టోనీ యాదవ్‌ కొన్నాళ్ల క్రితం ఓ ఎన్‌ఆర్‌ఐకి చెందిన స్థలంపై కన్నేశారు. అతను విదేశంలో నివసిస్తుండటంతో ఆ స్థలాన్ని దక్కించుకునేందుకు పథకం వేశారు. కల్కాజీ ప్రాంతంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో పనిచేసే సంజయ్‌ గోస్వామిని, గురుగ్రామ్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తోన్న ప్రదీప్‌ను, భీమ్‌సింగ్‌ అనే మరో వ్యక్తిని తమ పథకంలో భాగస్వాములుగా చేర్చుకున్నారు. సంజయ్‌తో భూరికార్డ్స్‌లో మార్పులు చేయించారు. 40 కోట్లు విలువ చేసే ఆ భూమికి ఎన్‌ఆర్‌ఐ కొన్నేళ్ల కిందటే ఓ వ్యక్తిని పవర్‌ ఆఫ్‌ అటార్నీగా నియమించినట్లు.. అతడి నుంచి 6 కోట్ల 60 లక్షలకు ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు నకిలీ దస్తావేజులు సృష్టించారు. 2001లోనే హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తి సంతకాన్ని, సందీప్‌ అనే మరో న్యాయవాది సంతకాన్ని టోనీ యాదవ్‌ ఫోర్జరీ చేసి సాక్షి సంతకాలు పెట్టాడు. ఈ అక్రమానికి ఏఎస్‌ఐ ప్రదీప్‌ సహకరించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ స్థలం యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సిట్‌ బృందంతో విచారణ చేయించి.. నిందితులను అరెస్ట్‌ చేశారు. తాజాగా కోర్టులో హాజరుపర్చి జ్యూడిషియల్‌ కస్టడీకి పంపించారు. పోలీసులు ఇలాంటి అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని గురుగ్రామ్‌ పోలీస్‌ కమిషనర్‌ స్పష్టం చేశారు. నిందితుల్లో ఒకరైన పోలీసుపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..