Pizza Delivery: గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్.. అయినా ఆన్ టైంలో పిజ్జా డెలివరీ.. ఎలా..?
బెంగళూరులో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. బెంగళూరులో ట్రాఫిక్ జామ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. నగరంలో ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రోడ్లపై వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. సాయంత్రం ఐదు గంటలకల్లా ఇంట్లో ఉండాల్సిన స్కూలు పిల్లలు రాత్రి ఎనిమిదికి కానీ చేరుకోలేదు. ఇంత ట్రాఫిక్ జామ్‌లో కూడా ఓ ఫుడ్ డెలివరీ బోయ్ తన విధులను సక్రమంగా నిర్వహించాడు.
బెంగళూరులో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. బెంగళూరులో ట్రాఫిక్ జామ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. నగరంలో ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రోడ్లపై వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. సాయంత్రం ఐదు గంటలకల్లా ఇంట్లో ఉండాల్సిన స్కూలు పిల్లలు రాత్రి ఎనిమిదికి కానీ చేరుకోలేదు. ఇంత ట్రాఫిక్ జామ్‌లో కూడా ఓ ఫుడ్ డెలివరీ బోయ్ తన విధులను సక్రమంగా నిర్వహించాడు. కస్ట్‌మర్‌కి సకాలంలో తన ఆర్డర్‌ను అందించాడు. ట్రాఫిక్ లో ఇరుక్కున్న కస్టమర్ ను వెతుక్కుంటూ వెళ్లి మరీ ఫుడ్ డెలివరీ చేశారు. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ ద్వారా డెలివరీ బాయ్ తమను వెతుక్కుంటూ వచ్చాడని ఆ కస్టమర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్విట్టర్ లో అప్ లోడ్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. వీడియోలో.. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఇంతలో డామినోస్ పిజ్జా డెలివరీ సిబ్బంది స్కూటీపై వచ్చి ఓ కారు ముందు ఆగారు. కారులో కూర్చున్న వారికి పిజ్జా అందించి వెళ్లిపోయారు. ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వెళుతూ ఆన్ లైన్ లో డామినోస్ పిజ్జా ఆర్డర్ చేసినట్లు కస్టమర్ రిషివస్త్ చెప్పారు. అనుకోకుండా ట్రాఫిక్ లో ఇరుక్కోవడంతో అదే విషయాన్ని డెలివరీ సిబ్బందికి చెప్పామన్నారు. తమ పరిస్థితి అర్థం చేసుకున్న డెలివరీ సిబ్బంది చాలా దయతో వ్యవహరించారని, లైవ్ ట్రాకింగ్ సాయంతో తమను వెతుక్కుంటూ వచ్చి పిజ్జా అందించారని వివరించారు. ఈ వివరాలతో పాటు పిజ్జా డెలివరీకి సంబంధించిన వీడియోతో ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు డామినోస్ డెలివరీ సిబ్బందిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..