ఆ రాష్ట్రంలో 63 శాతానికి పైగా ఓబీసీ, ఈబీసీలే.. నివేదికలో వెల్లడి
బిహార్‌లో కులగణన సర్వే నివేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇతర వెనుకబడిన తరగతులు(OBC), అలాగే అత్యంత వెనుకబడిన తరగతులను(EBC) కలిపి రాష్ట్ర జనాభాలో 63 శాతంగా ఉన్నట్లు ఓ నివేదిక తెలిపింది. అయితే ఈ రిపోర్టును రాష్ట్ర డెవలప్‌మెంట్ కమిషనర్ వివేక్ సింగ్ సోమవారం వివరించారు. అయితే తాజా నివేదిక ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం బిహార్‌లోని జనాభా దాదాపు 13.07 కోట్లుగా ఉంది.

బిహార్‌లో కులగణన సర్వే నివేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇతర వెనుకబడిన తరగతులు(OBC), అలాగే అత్యంత వెనుకబడిన తరగతులను(EBC) కలిపి రాష్ట్ర జనాభాలో 63 శాతంగా ఉన్నట్లు ఓ నివేదిక తెలిపింది. అయితే ఈ రిపోర్టును రాష్ట్ర డెవలప్‌మెంట్ కమిషనర్ వివేక్ సింగ్ సోమవారం వివరించారు. అయితే తాజా నివేదిక ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం బిహార్‌లోని జనాభా దాదాపు 13.07 కోట్లుగా ఉంది. అయితే వీళ్లలో అత్యంత వెనుబడిన తరగతుల (EBCs) వారు 36 శాతంగా ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. అలాగే ఇతర వెనుకబడిన తరగతుల (OBCs) వారి వాటా 27.13 శాతంగా ఉన్నట్లు చెప్పింది. అయితే ఇది కులాలవారీగా చూసుకున్నట్లైతే ఓబీసీ వర్గానికి చెందినటువంటి యాదవుల జనాభా ఎక్కువగా ఉందని ఆ నివేదిక పేర్కొంది. అలాగే మొత్తం రాష్ట్ర జనాభాలో గనుక చూసుకున్నట్లైతే వీళ్ల వాటా 14.27 శాతంగా ఉన్నట్లు చెప్పింది. అయితే షెడ్యూల్డ్ కులాల (SC) జనాభా 19.7 శాతం ఉండగా.. షెడ్యూల్డ్ తెగల (ST) జనాభా చూసుకుంటే 1.7 శాతంగా ఉంది.
అలాగే జనరల్ కేటగిరీకి చెందినవారి జనాభా కూడా 15.5 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఇదిలా ఉండగా.. ఇటీవల దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం అనే సాధ్యం కాదని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా.. తమ రాష్ట్రంలో ఈ కుల గణన ప్రక్రియను చేపడతామని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ గత ఏడాది జూన్ నెలలో ప్రకటన చేశారు. అయితే ఈ ఏడాది జనవరిలో కులాలవారీగా జనాభా లెక్కల సేకరణ మొదలైపోయింది. అలాగే రాష్ట్రంలో చూసుకుంటే 38 జిల్లాల్లో ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. చివరికీ రెండు దశల్లోను ఈ కుల గణన ప్రక్రియను పూర్తి చేశారు. ఇదిలా ఉండగా.. మరోవైపు కులగణన ప్రక్రియను వ్యతిరేకిస్తూ పట్నా హైకోర్టులో పలువురు పిటిషన్లు కూడా దాఖలు చేశారు.
అయితే న్యాయస్థానం ఆ పిటీషన్లపై విచారణ జరిపింది. చివరికి వాటిని కొట్టివేస్తూ ఆ కుల గణన ప్రక్రియ సర్వే చేసుకోవచ్చని అనుమతులు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే ప్రస్తుతం ఈ కుల గణన ప్రక్రియ అంశం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలోనే ఉంది. మరోవైపు ఈ కులగణన నివేదిక వచ్చిన నేపథ్యంలో.. అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నింటితో సమావేశం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ సోమవారం ఉదయం మీడియాకు చెప్పారు. అంతేకాదు ఈ సమావేశంలో కులగణన నివేదికపై చర్చలు కూడా సాగిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఓబీసీ కోటాను పెంచడంతో పాటుగా ఇతరత్రా అంశాలపై కూడా సమాలోచనలు జరుపుతామని వెల్లడించారు. మరోవైపు దేశవ్యాప్తంగా కులగణన ప్రక్రియను చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ బీజేపీ సర్కార్‌ను డిమాండ్ చేస్తూనే ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..