Raids on NewsClick: మళ్లీ తెరపైకి న్యూస్‌క్లిక్ వ్యవహారం.. జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు! ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు భారీగా స్వాధీనం
ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ న్యూస్ పోర్టల్‌కు చైనా నుంచి భారీగా నిధులు అందుతున్నాయంటూ ఇటీవలే వచ్చిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ ఏడాది ఆగస్టు 17న యూఏపీఏలోని యాంటీ టెర్రర్ లా, అన్‌లాఫుల్ యాక్టివిటీస్ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఈ ఆరోపణలపై తాజాగా ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా పలువురు జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు జరిపారు. న్యూస్‌క్లిక్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తోన్న పలువురు..
న్యూఢిల్లీ, అక్టోబర్ 3: ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ న్యూస్ పోర్టల్‌కు చైనా నుంచి భారీగా నిధులు అందుతున్నాయంటూ ఇటీవలే వచ్చిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ ఏడాది ఆగస్టు 17న యూఏపీఏలోని యాంటీ టెర్రర్ లా, అన్‌లాఫుల్ యాక్టివిటీస్ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఈ ఆరోపణలపై తాజాగా ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా పలువురు జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు జరిపారు. న్యూస్‌క్లిక్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తోన్న పలువురు ఉద్యోగులు, జర్నలిస్టుల ఇళ్లలో ఈ రోజు (అక్టోబర్ 3) ఉదయం ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విభాగం అధికారులు సోదాలు చేపట్టారు. అలాగే స్థానికంగా ఉన్న న్యూస్‌క్లిక్ కార్యాలయంతోపాటు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ సహా ఏకకాలంలో దాదాపు 100 ప్రదేశాల్లో దాడులు చేశారు. ఈ దాడుల్లోపెద్ద ఎత్తున ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే హార్డ్ డిస్క్‌లు కూడా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్ (ED) షేర్ చేసిన ఇన్‌పుట్‌ల ఆధారంగా సోదాలు చేశారు.
న్యూస్‌క్లిక్‌తో సంబంధం ఉన్న కొంతమంది జర్నలిస్టులను లోధీ రోడ్ స్పెషల్ సెల్ కార్యాలయానికి తీసుకువచ్చారని, అయితే ఇంతవరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని అధికారులు తెలిపారు. న్యూస్‌క్లిక్‌లోని జర్నలిస్టుల్లో ఒకరైన అభిసార్ శర్మ మాట్లాడుతూ.. ఢిల్లీ పోలీసులు తన ఇంటికి వచ్చి ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
#WATCH | Delhi Police Special Cell ACP Lalit Mohan Negi reaches NewsClick office in Delhi.
Raids at different premises linked to NewsClick are currently underway at over 30 locations, no arrests made so far. pic.twitter.com/KezrcJes7A
— ANI (@ANI) October 3, 2023
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ వారు విచారించిన కొంతమంది న్యూస్‌క్లిక్ జర్నలిస్టులను 25 రకాల ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. షాహీన్ బాగ్ నిరసనలు, రైతుల నిరసనలు, ఈశాన్య నిరసనలు, వారి విదేశీ ప్రయాణ వివరాలకు సంబంధించిన ప్రశ్నలు అధికారులు అడిగారు. న్యూస్‌క్లిక్‌కు ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అధికారిక నివాసంలో కూడా ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించారు.
#WATCH | NewsClick writer Paranjoy Guha Thakurta seen with the officials of Delhi Police Special Cell.
Delhi Police is conducting raids at different premises linked to NewsClick under UAPA and other sections. pic.twitter.com/7VCGk1pJJp
— ANI (@ANI) October 3, 2023
అలాగే సీపీఎం ఉద్యోగి నారాయణ ఇంటిపై కూడా దాడి జరిగింది. నారాయణ్ కొడుకు న్యూస్ క్లిక్‌లో ఉద్యోగి కావడంతో అతని ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే వారు దేని విషయమై దర్యాప్తు చేస్తున్నారో తమకు తెలియదని, ఇది మీడియా దృష్టిని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నమని, దీని వెనుక ఉన్న కారణాన్ని దేశం తెలుసుకోవాలంటూ సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు.
#WATCH | Delhi: Raids underway at the NewsClick office.
Raids at different premises linked to NewsClick are currently underway at over 30 locations, no arrests made so far. pic.twitter.com/YQBMRsoVkx
— ANI (@ANI) October 3, 2023
కాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మూడేళ్ల దర్యాప్తులో రూ. 38.05 కోట్ల మేరకు విదేశీ నిధులను న్యూస్‌క్లిక్ సేకరించినట్లు వెల్లడైంది. అమెరికన్ మిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ తరపున న్యూస్‌క్లిక్‌కు చైనా నుంచి భారీగా నిధులు అందినట్లు ఈడీ ధర్యాప్తులో బయటపడింది. నెవిల్లే చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC)తో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలోనే న్యూస్‌క్లిక్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి ఈ మేరకు దర్యాప్తు చేపడుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.