Viral Video: భారీ సభలో బీజేపీ మాజీ సీఎం కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే.. వీడియో వైరల్‌

దివంగత తాన్ సింగ్ చౌహాన్ సంస్మరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాజస్థాన్‌ మాజీ సీఎం రాజే సహా పలు పార్టీల నాయకులు హాజరయ్యారు. కార్యక్రమానికి బార్మర్‌ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎన్నికైన ఎమ్మెల్యే మెవరమ్‌ జైన్‌ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భారీ సంఖ్యలో వచ్చిన బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలందరూ నేలపై కూర్చొని ఉండగా.. వాళ్లను దాటుకుంటూ వచ్చిన ఎమ్మెల్యే మెవరమ్‌ జైన్‌ రాజేను చూసి, ఆమె వద్దకు వెళ్లి కాళ్లుమొక్కి..

Viral Video: భారీ సభలో బీజేపీ మాజీ సీఎం కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే.. వీడియో వైరల్‌
Rajasthan Congress MLA Mevaram Jain
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 03, 2023 | 5:48 PM

జైపూర్, అక్టోబర్‌ 3: రాజస్థాన్‌కు చెందిన ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుంధరా రాజే కాళ్లు మొక్కి, ఆశీర్వాదం తీసుకోవడం చర్చణీయాంశంగా మారింది. ఆ రాష్ట్రంలోని బార్మర్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

దివంగత తాన్ సింగ్ చౌహాన్ సంస్మరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాజస్థాన్‌ మాజీ సీఎం రాజే సహా పలు పార్టీల నాయకులు హాజరయ్యారు. కార్యక్రమానికి బార్మర్‌ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎన్నికైన ఎమ్మెల్యే మెవరమ్‌ జైన్‌ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భారీ సంఖ్యలో వచ్చిన బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలందరూ నేలపై కూర్చొని ఉండగా.. వాళ్లను దాటుకుంటూ వచ్చిన ఎమ్మెల్యే మెవరమ్‌ జైన్‌ రాజేను చూసి, ఆమె వద్దకు వెళ్లి కాళ్లుమొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. జైన్‌ కాళ్లు మొక్కడం చూసిన రాజె.. వెంటనే మైక్‌ చేతిలోకి తీసుకుని.. మిమ్మల్ని ఇక్కడ చూడటం సంతోషంగా ఉంది. ఇది మనందరినీ కనెక్ట్ చేయడానికి ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ అని అన్నారు. అనంతరం.. మీడియా మిత్రులు నా మాటలు వినాలి. ఇది ఒక సామాజిక కార్యక్రమం. ఈ కార్యక్రమం 36 సామాజిక వర్గాలను కలుపడానికి పనిచేస్తుంది. దివంగత తాన్ సింగ్ చౌహాన్ అందరినీ ఏక తాటిపై నడింపించిన వ్యక్తి. ఆయన జీవితం నుంచి మనం చాలా నేర్చుకోవాలి. డ్రైవర్‌గా చిన్న ఉద్యోగం నుంచి ప్రజా నాయకుడిగా ఆయన ఎదిగిన విధానం మనందరికీ స్ఫూర్తిదాయకం అని ఆమె అన్నారు.

కాగా రాజస్థాన్‌లోని బీజేపీ పెద్దలు తనను పట్టించుకోవడం లేదని వసుంధరా రాజే సొంత పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా ఆమె దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ను వసుంధరా రాజే కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వసుంధరా రాజే త్వరలో కాంగ్రెస్‌లో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.