AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Marriages: ఆ రాష్ట్రంలో బాల్య వివాహాలు చేసుకుంటే ఇక అంతే సంగతులు..

దేశంలో బాల్య వివాహం అనే దురాచారం ఎన్నో ఏళ్లుగా కొనసాగింది. ఆ తర్వాత సంఘసంస్కర్తల కృషి వల్ల బాల్యావివాహలు తగ్గిపోయాయి. కానీ ఇవి పూర్తిగా అంతం కాలేదు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉంది. ముఖ్యంగా అస్సాంలో బాల్యవివాహాలు, శిశుమరణాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని తగ్గించుకునేందుకు అస్సాం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ అంశాల పట్ల సమాజంలో మార్పులు తీసుకొచ్చేందుకు.. అలాగే చిన్నారులకు మంచి భవిష్యత్తును అందించేందుకు కృషి చేస్తోంది.

Child Marriages: ఆ రాష్ట్రంలో బాల్య వివాహాలు చేసుకుంటే ఇక అంతే సంగతులు..
Child Marriage
Aravind B
|

Updated on: Oct 03, 2023 | 6:14 PM

Share

దేశంలో బాల్య వివాహం అనే దురాచారం ఎన్నో ఏళ్లుగా కొనసాగింది. ఆ తర్వాత సంఘసంస్కర్తల కృషి వల్ల బాల్యావివాహలు తగ్గిపోయాయి. కానీ ఇవి పూర్తిగా అంతం కాలేదు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉంది. ముఖ్యంగా అస్సాంలో బాల్యవివాహాలు, శిశుమరణాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని తగ్గించుకునేందుకు అస్సాం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ అంశాల పట్ల సమాజంలో మార్పులు తీసుకొచ్చేందుకు.. అలాగే చిన్నారులకు మంచి భవిష్యత్తును అందించేందుకు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో.. బాల్యవివాహం చేసుకన్నా కూడా అందుకు సహకరించిన వాళ్లపై కూడా ప్రభుత్వం మళ్లీ కొరడా ఝళిపించింది. అయితే తాజాగా 800 మందికి పైగా అరెస్టు చేశామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. చట్టానికి వ్యతిరేకంగా బాల్య వివాహాలు చేసుకున్న వారిపై ఈ ఏడాది ప్రారంభం నుంచి తమ ప్రభుత్వం అరెస్టులను కొనసాగిస్తోందని పేర్కొన్నారు.

ఇందులో భాగంగానే మరోసారి రాష్ట్ర పోలీసులు నిందితులపై చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా 800 మందికి పైగా అరెస్టులు చేశామని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. అంతేకాదు ఈ అరెస్టుల సంఖ్య రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా.. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా చూస్తే ఈ ఏడాది మొదట్లో 2,278 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వాళ్ల కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్ల ముందు నిరసనలు కూడా చేపట్టారు. అప్పట్లో ఇందుకు సంబంధించిన ఈ వార్తలు చర్చనీయాంశమయ్యయాయి. మరోవైపు అస్సాంలో బాల్య వివాహాలు, మాతా శిశు మరణాలను తగ్గించడానికి 14 నుంచి 18 ఏళ్ల లోపు బాలికలను వివాహం చేసుకున్నవారిని బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం.. అలాగే 14 ఏళ్ల లోపు వారిని వివాహం చేసుకుంటే పోక్సో చట్టం కింద అరెస్టు చేయాలని కొద్ది నెలల క్రితమే అస్సాం కేబినెట్‌ నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ అరెస్టుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. అయితే బాల్య వివాహం చేసుకున్న వారితో సహా.. దీనికి సహకరించిన మత పెద్దలపై కూడా వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు ఇలాంటి చర్యలకు పాల్పడితే.. బాలికల తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే గత ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే బాల్యవివాహాలకు సంబంధించిన కేసుల్లో మొత్తం 3,907 మందిని అరెస్టు చేశామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.