Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar Caste Census: బీహార్‌లో కులగణన సర్వే విడుదల.. ఇండియా కూటమి-బీజేపీ మధ్య మాటలయుద్దం..

Patna, October 03: బీహార్‌ ప్రభుత్వం తీవ్ర ఉత్కంఠ మధ్య కులగణన సర్వేను విడుదల చేసింది. రాష్ట్రంలో 63 శాతం ఓబీసీ జనాభా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. మోదీ ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికి కులగణనను విజయవంతంగా పూర్తి చేశామన్నారు బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్. అయితే కులాల మధ్య చిచ్చుపెట్టడానికే దీనిని తెరపైకి తెచ్చారని బీజేపీ విమర్శించింది.

Bihar Caste Census: బీహార్‌లో కులగణన సర్వే విడుదల.. ఇండియా కూటమి-బీజేపీ మధ్య మాటలయుద్దం..
Caste Sensus
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 03, 2023 | 9:57 AM

Patna, October 03: బీహార్‌ ప్రభుత్వం తీవ్ర ఉత్కంఠ మధ్య కులగణన సర్వేను విడుదల చేసింది. రాష్ట్రంలో 63 శాతం ఓబీసీ జనాభా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. మోదీ ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికి కులగణనను విజయవంతంగా పూర్తి చేశామన్నారు బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్. అయితే కులాల మధ్య చిచ్చుపెట్టడానికే దీనిని తెరపైకి తెచ్చారని బీజేపీ విమర్శించింది.

కులగణన సర్వే విడుదల చేసిన బీహార్‌ ప్రభుత్వం..

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కులగణన సర్వేను విడుదల చేసింది బీహార్‌ ప్రభుత్వం. రాష్ట్రంలో ఓబీసీ జనాభా 63 శాతంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. రాష్ట్ర జనాభాలో బీసీలు రిపోర్టును రాష్ట్ర డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ వివేక్‌ సింగ్‌ విడుదల చేశారు. కులగణన నివేదిక ప్రకారం బీహార్‌ రాష్ట్ర జనాభా దాదాపు 13.07 కోట్లు. దీనిలో అత్యంత వెనుబడిన తరగతులు అంటే ఈబీసీలు రు 36 శాతంగా ఉన్నారు. ఇతర వెనుకబడిన తరగతుల వాటా 27.13 శాతంగా తేలింది.

యాదవుల వాటా 14.27 శాతం..

కులాలవారీగా చూస్తే ఓబీసీ వర్గానికి చెందిన యాదవుల జనాభా అత్యధికంగా ఉందని నివేదిక తెలిపింది. మొత్తం రాష్ట్ర జనాభాలో యాదవుల వాటా 14.27 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. షెడ్యూల్డ్‌ కులాల జనాభా 19.7 శాతం, షెడ్యూల్డ్‌ తెగల జనాభా 1.7 శాతంగా నమోదైంది. జనరల్‌ కేటగిరీకి చెందినవారి జనాభా 15.5 శాతంగా ఉన్నట్లు తేలింది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం వీలుకాదని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో తమ రాష్ట్రంలో ఈ ప్రక్రియ చేపడతామని బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ గత ఏడాది జూన్‌లో ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో కులాలవారీగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది.

ఇవి కూడా చదవండి

రాష్ట్రంలోని 38 జిల్లాల్లో, రెండు దశల్లో ఈ ప్రక్రియను కులగణనను పూర్తి చేశారు. అయితే, కులగణను వ్యతిరేకిస్తూ పాట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయస్థానం వాటిని కొట్టివేస్తూ సర్వేకు అనుమతించింది. దీంతో ఈ విషయం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం ఈ అంశం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉంది. ప్రధాని మోదీ అడ్డుకున్నప్పటికి బీహార్‌లో విజయవంతంగా కులగణన పూర్తయ్యిందన్నారు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌. ‘‘కులగణనను ప్రధాని మోదీ వ్యతిరేకించారు. లోక్‌సభ, రాజ్యసభలో ఆపారు. కాని మేము చేసి చూపించాం. దీనికోసం స్వర్గీయ ములాయంసింగ్‌, స్వర్గీయ శరద్‌యాదవ్, లాలూ ప్రసాద్, నితీష్‌ కుమార్ పోరాడారు. ఎవరు చెత్తను తొలగిస్తారు.. నాలాలను ఎవరు శుభ్రం చేస్తారు.. గుడిసెల్లో ఎవరు ఉన్నారు.. కార్మికులు.. భూమి లేని వాళ్లు ఎంతమంది ఉన్నారన్న విషయంపై ఈ సర్వేలో తేలింది’’ అని చెప్పారు తేజస్వి యాదవ్.

కులగణన నివేదికపై అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నింటితో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు నితీష్‌ కుమార్‌. ఈ భేటీలో కులగణన నివేదికపై చర్చిస్తామన్నారు. ఓబీసీ కోటా పెంపు సహా ఇతరత్రా అంశాలపై సమాలోచనలు జరుపుతామన్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల వేళ ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికే కులరాజకీయాలపై తెరపైకి తెచ్చారని బీజేపీ విమర్శించింది. ‘‘కులాల మధ్య చిచ్చుపెట్టడం లాలూప్రసాద్‌కు అలవాటు. అయితే కులగణనను మేము సమర్ధిస్తున్నాం.. మంచి నివేదిక ఇచ్చారు. మేము కుల రాజకీయాలు కాకుండా అభివృద్ది రాజకీయాలు చేస్తాం’’ అని బీజేపీ నేతలు అన్నారు. ఇక బీహార్‌లో కులగణన నివేదికను స్వాగతించారు రాహుల్‌గాంధీ. జనాభా ఆధారంగా సీట్లు దక్కాలని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మార్చి 30న శ్రీ ఆదిశంకర మఠంలో ఉగాది పంచాంగ శ్రవణం
మార్చి 30న శ్రీ ఆదిశంకర మఠంలో ఉగాది పంచాంగ శ్రవణం
మనోజ్‌ బాజ్‌పాయ్‌ 'ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మనోజ్‌ బాజ్‌పాయ్‌ 'ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పచ్చి అరటికాయ ప్రయోజనాలు తెలిస్తే.. పిందె కూడా వదిలిపెట్టరండోయ్..
పచ్చి అరటికాయ ప్రయోజనాలు తెలిస్తే.. పిందె కూడా వదిలిపెట్టరండోయ్..
Team India: రోహిత్ స్థానంలో టీమిండియా కెప్టెన్‌గా ఎవరంటే..?
Team India: రోహిత్ స్థానంలో టీమిండియా కెప్టెన్‌గా ఎవరంటే..?
ప్రపంచంలోని టాప్ 10 సెంట్రల్ బ్యాంకుల కంటే మనదేశంలో ఎక్కువ బంగారం
ప్రపంచంలోని టాప్ 10 సెంట్రల్ బ్యాంకుల కంటే మనదేశంలో ఎక్కువ బంగారం
దారుణం.. సంతానం కోసం నరబలి.. కొడుకు పుట్టాలని వృద్ధుడి తలతో..
దారుణం.. సంతానం కోసం నరబలి.. కొడుకు పుట్టాలని వృద్ధుడి తలతో..
ఈ టాలీవుడ్ బ్యూటీని గుర్తు పట్టారా? ఈమె భర్త పవర్ ఫుల్ విలన్
ఈ టాలీవుడ్ బ్యూటీని గుర్తు పట్టారా? ఈమె భర్త పవర్ ఫుల్ విలన్
యమునా నది పరిశుభ్రతకే ప్రాధాన్యతః సీఎం రేఖా
యమునా నది పరిశుభ్రతకే ప్రాధాన్యతః సీఎం రేఖా
Video: ఒరేయ్ ఆజామూ.. గల్లీ ప్లేయర్‌ల కంటే దారుణంగా ఉన్నారేంది
Video: ఒరేయ్ ఆజామూ.. గల్లీ ప్లేయర్‌ల కంటే దారుణంగా ఉన్నారేంది
ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి ఉగాదిని సెలబ్రేట్ చేయండి ఇలా..!
ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి ఉగాదిని సెలబ్రేట్ చేయండి ఇలా..!