AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: ప్రభుత్వాసుపత్రిలో దారుణ ఘటన.. 24 గంటల్లో 24 మంది రోగుల మృతి.. మరణించిన వారిలో 12 మంది నవజాత శిశువులు

ఆసుపత్రిలో మందులు, సిబ్బంది కొరత కారణంగా 24 గంటల్లో ఆసుపత్రిలో 24 మంది మరణించారని డీన్ పేర్కొన్నారు, అయితే డీన్ వాదనను ఆసుపత్రి పరిపాలన స్వయంగా ఖండించింది. ఆసుపత్రిలో అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని, ఆసుపత్రికి 12 కోట్ల రూపాయల నిధులు కూడా ఉన్నాయని ఆసుపత్రి యంత్రాంగం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో మందులు లేకపోవడంతో రోగులు చనిపోయారని చెప్పడం సరికాదన్నారు.

Maharashtra: ప్రభుత్వాసుపత్రిలో దారుణ ఘటన.. 24 గంటల్లో 24 మంది రోగుల మృతి.. మరణించిన వారిలో 12 మంది నవజాత శిశువులు
government hospital in Nanded
Follow us
Surya Kala

|

Updated on: Oct 03, 2023 | 10:02 AM

మహారాష్ట్రలో దారుణ ఘటన జరిగింది. నాందేడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత 24 గంటల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో 12 మంది నవజాత శిశువులు ఉండడంతో విషాదం నెలకొంది. ఈ  భూమి మీదకు వచ్చిన వెంటనే ప్రాణాలు పోగొట్టుకున్న హృదయ విదారక ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో ఈ మరణాలకు కారణం అజాగ్రత్త వ్యవస్థతో పాటు మందులు, సిబ్బంది కొరతే కారణమని ఆసుపత్రి డీన్‌ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఆసుపత్రి యాజమాన్యం ఖండించింది.

ఈ దారుణ ఘటన నాందేడ్‌లోని శంకర్‌రావ్ చవాన్ ప్రభుత్వ వైద్య ఆసుపత్రిలో చోటు చేసుకుంది. గత 24 గంటల్లో వివిధ వ్యాధులతో బాధపడుతూ 12 మందికి పైగా పెద్దలు చేరారు. వీరిలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు కూడా ఉన్నారు. అంతేకాదు ఈ 24 గంటల్లోనే పుట్టిన నవజాత శిశువులు కూడా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి బలి అయ్యారు. ఈ విషయాన్ని ఆసుపత్రి డీన్ డాక్టర్ వాకడే ధృవీకరించారు.

70-80 కి.మీ లోపు అదే ఆసుపత్రి

శంకర్రావు చవాన్ ప్రభుత్వ ఆసుపత్రి డీన్ డాక్టర్ వాల్కడే ప్రకారం.. 70-80 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఏకైక ఆసుపత్రి. ఇది తృతీయ స్థాయి ఆరోగ్య కేంద్రం.. భారీ సంఖ్యలో రోగులు ఈ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం  వస్తారు. కొన్నిసార్లు బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆస్పత్రి నిర్వహణ చాలా కష్టంగా మారుతుంది. ఈసారి కూడా రోగులకు మందులు కొనాల్సి వచ్చినా కొనుగోళ్లు జరగలేదు. ఆసుపత్రి యాజమాన్యం స్థానికంగా మందులు కొనుగోలు చేసి రోగులకు కూడా అందించినప్పటికీ ఆ మందులు సరిపోలేదు.

ఇవి కూడా చదవండి

ఆరోపణలను తోసిపుచ్చిన ఆసుపత్రి యంత్రాంగం

ఆసుపత్రిలో మందులు, సిబ్బంది కొరత కారణంగా 24 గంటల్లో ఆసుపత్రిలో 24 మంది మరణించారని డీన్ పేర్కొన్నారు, అయితే డీన్ వాదనను ఆసుపత్రి పరిపాలన స్వయంగా ఖండించింది. ఆసుపత్రిలో అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని, ఆసుపత్రికి 12 కోట్ల రూపాయల నిధులు కూడా ఉన్నాయని ఆసుపత్రి యంత్రాంగం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో మందులు లేకపోవడంతో రోగులు చనిపోయారని చెప్పడం సరికాదన్నారు. మృతుల్లో 12 మంది వయోజన రోగులు ఉన్నారని.. ఏడుగురు మహిళలు  ఐదుగురు పురుషులు ఉన్నారని.. వారిలో నలుగురు గుండె జబ్బులతో బాధపడుతున్నారని, ఒకరు విషం సేవించారని, ఒకరు గ్యాస్ట్రోతో బాధపడుతున్నారని ఆసుపత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇద్దరు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఒక రోగి డెలివరీ సమస్యలతో బాధపడుతుండగా, ముగ్గురు ప్రమాదానికి గురయ్యారు.

దురదృష్టకరమైన ఘటన అన్న ముఖ్యమంత్రి

మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన ఈ ఘటన దురదృష్టకరమని సీఎం సీఏ ఏక్‌నాథ్ షిండే వర్ణించారు.  విలేకరులతో మాట్లాడుతూ కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఆరా తీస్తామని.. దోషులను గుర్తించి ఎటువంటి స్థాయిలో ఉన్నా వారిని వదిలిపెట్టబోమని అన్నారు. మరోవైపు మహారాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ దిలీప్ మహైసేకర్ పీటీఐతో మాట్లాడుతూ మరణాలపై దర్యాప్తు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రేపు మధ్యాహ్నం 1 గంటలోపు ఈ బృందం నివేదికను సమర్పిస్తుందని తెలిపారు.

సంతాపం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ

నాందేడ్‌లో జరిగిన ఈ ఘటనపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేస్తూ  మృతుల కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. బీజేపీ ప్రభుత్వం తన పబ్లిసిటీ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది కానీ పిల్లలకు మందులకు డబ్బులు లేవా అని ప్రశ్నించారు.. అంతకుముందు ప్రియాంక గాంధీ వాద్రా కూడా పోస్ట్ చేస్తూ సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ  చేయండి..