Viral: విమానంలో చిన్నారికి ఊపిరిపోసిన ఒకప్పటి డాక్టర్ ప్రస్తుత ఐఏఎస్ అధికారి.
జన్మతః గుండె సమస్యలతో బాధపడుతున్న ఓ చిన్నారికి విమానంలో శ్వాసపరమైన సమస్యలు తలెత్తడంతో అదే విమానంలో వెళుతున్న ఇద్దరు ప్రయాణికులు ప్రాథమిక చికిత్స అందించి కాపాడారు. శనివారం ఝార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి దిల్లీ వెళుతున్న విమానంలో ఈ ఘటనలో చోటుచేసుకుంది. గుండె సమస్యతో బాధపడుతున్న తమ ఆరు నెలల కుమార్తెకు ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స చేయించేందుకు ఓ దంపతులు తీసుకెళుతున్నారు.
జన్మతః గుండె సమస్యలతో బాధపడుతున్న ఓ చిన్నారికి విమానంలో శ్వాసపరమైన సమస్యలు తలెత్తడంతో అదే విమానంలో వెళుతున్న ఇద్దరు ప్రయాణికులు ప్రాథమిక చికిత్స అందించి కాపాడారు. శనివారం ఝార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి దిల్లీ వెళుతున్న విమానంలో ఈ ఘటనలో చోటుచేసుకుంది. గుండె సమస్యతో బాధపడుతున్న తమ ఆరు నెలల కుమార్తెకు ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స చేయించేందుకు ఓ దంపతులు తీసుకెళుతున్నారు. విమానం గాల్లోకి ఎగిరిన 20 నిమిషాలకు పాపకు శ్వాసపరమైన ఇబ్బందులు మొదలయ్యాయి. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఐఏఎస్ అధికారైన వైద్యుడు, ఝార్ఖండ్ గవర్నర్ ముఖ్య కార్యదర్శి డాక్టర్ నితిన్ కులకర్ణి, రాంచీలోని సదర్ ఆసుపత్రికి చెందిన మరో వైద్యుడు మొజామిల్ ఫిరోజ్ పెద్దలకు పెట్టే ఆక్సిజన్ మాస్కుతో చిన్నారికి ప్రాణవాయువు అందించారు. తల్లిదండ్రులు దగ్గరున్న ఔషధాల కిట్‌లో నుంచి ఓ ఇంజెక్షన్ తీసి చేశారు. కొద్దిసేపటికి పాప ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. అనంతరం ఓ గంటకు విమానం ఢిల్లీలో దిగగా.. అక్కడి వైద్య బృందం పాపకు చికిత్స ప్రారంభించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..