Viral Video: స్విమ్మింగ్ పూల్ ప్రత్యక్షమైన మొసలి పిల్ల.. మరి తల్లి ఎక్కడ..? భయంగా భయంగా స్థానికులు..

మొసలి పిల్లను పట్టుకునే క్రమంలో స్విమ్మింగ్ పూల్ క్లీనెస్ ఉద్యోగి గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించి సకాలంలో వైద్య సహాయం అందించి త్వరగా కోలుకునేలా చేశారు సిబ్బంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. మొసలి పిల్ల సాధారణంగా కొలనులో ఈత కొడుతూ అక్కడక్కడ తిరుగుతుండటం కనిపించింది.

Viral Video:  స్విమ్మింగ్ పూల్ ప్రత్యక్షమైన మొసలి పిల్ల.. మరి తల్లి ఎక్కడ..? భయంగా భయంగా స్థానికులు..
Crocodile
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 03, 2023 | 1:12 PM

సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో అడవి జంతువులు, పాములు, కోతులు, పులులకు సంబంధించిన అనేక రకాల వీడియోలు ఇంటర్‌నెట్‌లో మనం చూస్తుంటాం. ఇక అప్పుడప్పుడు నగరాలు పట్టణాల్లో ప్రత్యక్షమవుతున్న భారీ కొండచిలువలు, మొసళ్లకు సంబంధించిన వీడియోలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ కూడా అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ముంబయిలోని BMC శివాజీ పార్క్ స్విమ్మింగ్ పూల్ లోపల 2 అడుగుల పొడవున్న మొసలి కనిపించింది. BMC స్విమ్మింగ్ పూల్ లోపల భారీ మొసలి ప్రత్యక్షమైంది. దీంతో అక్కడికి వచ్చిన సందర్శకులు భయంతో పరుగులు తీశారు.

ముంబయిలోని BMC శివాజీ పార్క్ స్విమ్మింగ్‌ పూల్‌లో స్విమ్మింగ్‌ చేసేందుకు గానూ.. దాదాపు పిల్లలతో సహా రోజుకు 2,000 మంది వస్తుంటారు. మొసలి పిల్లను పట్టుకునే క్రమంలో స్విమ్మింగ్ పూల్ క్లీనెస్ ఉద్యోగి గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించి సకాలంలో వైద్య సహాయం అందించి త్వరగా కోలుకునేలా చేశారు సిబ్బంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. మొసలి పిల్ల సాధారణంగా కొలనులో ఈత కొడుతూ అక్కడక్కడ తిరుగుతుండటం కనిపించింది.

ఇవి కూడా చదవండి

మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్‌లో మొసలి పిల్ల కనిపించింది. నిపుణుల సహాయంతో మొసలిని పట్టుకుని అటవీ శాఖకు అప్పగించారు. స్విమ్మింగ్ పూల్‌లోకి మొసలి పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ జరుపుతామని, తదనుగుణంగా భవిష్యత్తులో అవసరమైన నివారణ చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ (పార్క్స్) కిషోర్ గాంధీ తెలిపారు.

దీని గురించి మరింత సమాచారం ఇస్తూ, స్విమ్మింగ్ పూల్, థియేటర్ కోఆర్డినేటర్ సందీప్ వైశంపాయన్ మాట్లాడుతూ, ప్రతి ఉదయం స్విమ్మింగ్ పూల్‌ను సభ్యుల కోసం తెరవడానికి ముందు సంబంధిత సిబ్బంది జాగ్రత్తగా తనిఖీ చేస్తారు. దీని ప్రకారం ఈరోజు తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్ ను పరిశీలించగా.. ఒలింపిక్ సైజ్ రేసింగ్ స్విమ్మింగ్ పూల్ లో మొసలి పిల్ల కనిపించిందని చెప్పారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడేవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్టైంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..