Telangana: కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఎందుకు ఆలస్యం అవుతుంది.. ? ఆశావాహుల్లో టెన్షన్ టెన్షన్..
Hyderabad: కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ ఎటు తేల్చుకోలేకపోతుందా...? అభ్యర్థుల ఎంపిక పై నేతలు రెండుగా విడిపోయారా...? ఇచ్చిన హామీ మేరకు సామాజిక సమీకరణలపై స్క్రీనింగ్ కమిటీ ఎం తేల్చనున్నారు...? పొత్తులపై తేల్చాలన్న జాతీయ నేతలకు స్క్రినింగ్ కమిటీ ఇచ్చే స్థానాలేవి...? పార్టీలో భారీగా పెరుగుతున్న టికెట్ ఆశవహులకు భరోసా ఏది...? ఇంతకీ అభ్యర్థుల ఎంపిక లో తెలంగాణ కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి
హైదరాబాద్,అక్టోబర్03: అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ కొనసాగుతుంది.. ఎంపిక పై స్క్రీనింగ్ కమిటీ వరుస సుధీర్ఘ సమావేశాలు నిర్వహిస్తున్నా అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం లేక ఎటు తేల్చకోలేకపోతున్నారు.. కమిటీ లో ఉన్న రాష్ట్ర నేతలే కాదు, ఏఐసీసీ నియమించిన సభ్యుడు సైతం తమ వర్గానికి మెజారిటీ టికెట్ కేటాయించాలని పట్టుబడుతున్నారట.. ఇటు ఎవరికి వారు వారి అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారట.. ఇప్పటి వరకు దాదాపు 40 లోపు స్థానాలపై మాత్రమే స్క్రీనింగ్ కమిటీ ఏకాభిప్రాయం వచ్చిందని సమాచారం.. మరో 35 నియోజకవర్గాలకు రెండేసి పేర్లు లిస్ట్ సిద్ధం చేసి ఉంచారట.. ఇక మరో 40 స్థానాల్లో ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.. అందులో పొత్తు స్థానాలు , సామాజిక సమీకరణాలు, పార్టీలో కొత్తగా చేరుతున్న వారికి కేటాయించాల్సి ఉంది.. చివర 40 స్థానాలు ప్రకటించడం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.. కొత్తగా చేరే వారికి టికెట్ ఇచ్చే పక్షంలో పాత నేతలను బుజ్జగించాలని భావిస్తున్నారు..
ఇక, మైనారిటీలు అధికంగా ఉన్నా నిజామాబాద్ , కరీంనగర్ , మహబూబ్ నగర్ ,ఆదిలాబాద్ స్థానాలకు మైనారిటలను కేటాయించాలని స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు బాబా సిద్ధికి పట్టుబడుతున్నట్టు సమాచారం.. మైనార్టీలకు సరైన స్థానాలను కేటాయించినప్పుడే ఓట్లు అడగడానికి ఉంటుందని ఇతర సభ్యులతో వాదిస్తున్నారట.. ఇక ప్రతి పార్లమెంట్ కి 2 స్థానాల చొప్పున 34 బిసి లకు కేటాయించాల్సి ఉంది.. ఇక్కడ ముందు నుండి పార్టీలో ఉన్న సీనియర్ బిసి నేతల వద్దే పోటీ అధికంగా ఉంది.. మధుయాష్కి గౌడ్ , పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య , అంజనీ కుమార్ యాదవ్ , మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు..ఇక పార్టీలో ఎలాంటి పోటీ లేకుండా కొంత మంది బిసి నేతలకు టికెట్లు వస్తున్నాయి.. కానీ అన్నీ, కౌంట్ చేస్తే 34 సీట్లు ఇవ్వాల్సిన చోట 25 -30 లోపే అయ్యే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయని వీటిని మరోసారి పరిశీలిస్తున్నట్లు సమాచారం…అయితే ఇప్పటి వరకు అనుకున్న స్థానాల్లో దాదాపు 12 వెలమ సామాజిక వర్గానికి సంబదించిన పేర్లు ఉన్నట్టు తెలుస్తుంది.. ముఖ్య నేతల పేర్లు అలాగే ఉంచి, అందులో నుండి కోత విధించి బిసి లకు కేటాయించాలని సమాచారం..
మరోవైపు పొత్తులపై ఇరు పార్టీల జాతీయ నేతలు సానుకూలంగా ఉండడం..పొత్తులపై తేల్చాలని అగ్రనేతలు చెప్పడంతో ఏం చేయాలో అర్ధంకాక మల్లగుల్లలు పడుతున్నారట.. ఎర్రజెండాలు అడిగే స్థానాల్లో కాంగ్రెస్ బలంగా ఉండడం ఈసారి పక్క గెలుస్తామని అనుకున్న స్థానాల్లోనే వారు అడుగుతుండడంతొ ఇతర స్థానాలొ వారికి పట్టులేకపోవడంతో ఎటు తేల్చుకోలేకపోతున్నారు.. దీంతో ఈనెల 27 న మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇవన్నీ అంశాలపై చర్చించి ఆరోజు తొలి జాబితా కి సంబందించిన లిస్ట్ ని చైర్మన్ మురళీధరన్ సీఈసి కి ఇవ్వనున్నారు..దీంతో అభ్యర్థుల తొలి జాబితా అక్టోబర్ తొలి వారంలో వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై త్వరగా తేల్చాల్సి అవసరం ఉంది. అయితే విడతల వారీగా అభ్యర్థుల ప్రకటన చేసేటప్పుడు ప్రకటన కంటే ముందే టికెట్ రాని అసంతృప్తులను ముందుగా బుజ్జగించాలని అధిష్టానం ఆదేశాలు ఉండడంతో, వారికి భావిష్యత్ లో ఇచ్చే ప్రాధాన్యత పై హామీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంతమంది టికెట్ రాని ఆశవాహులు పార్టీ లైన్ లో పనిచేసి విజయతీరాలను చెరుస్తారో చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..