GPS: జీపీఎస్‌ను నమ్ముకుని నదిలో మునిగిన ఇద్దరు డాక్టర్లు.. నేరుగా నదిలోకి తీసుకెళ్లింది.
రోడ్డు ప్రయాణాల సమయంలో టెక్నాలజీని నమ్ముకొని సొంతంగా ఆలోచించడం మానేస్తే.. అది ప్రాణాంతకంగా మారుతుందని కేరళ లో జరిగిన ఈ ఘటన చెబుతోంది. ఇద్దరు యువ డాక్టర్లు జీపీఎస్‌ను నమ్ముకొని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో చోటు చేసుకొంది. కొల్లాంకు చెందిన డాక్టర్ అద్వైత్, త్రిశూర్‌కు చెందిన డాక్టర్ అజ్మల్ ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు. వీరు ఆస్పత్రిలో విధులు ముగించుకొని శనివారం రాత్రి ఇళ్లకు బయల్దేరారు.
రోడ్డు ప్రయాణాల సమయంలో టెక్నాలజీని నమ్ముకొని సొంతంగా ఆలోచించడం మానేస్తే.. అది ప్రాణాంతకంగా మారుతుందని కేరళ లో జరిగిన ఈ ఘటన చెబుతోంది. ఇద్దరు యువ డాక్టర్లు జీపీఎస్‌ను నమ్ముకొని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో చోటు చేసుకొంది. కొల్లాంకు చెందిన డాక్టర్ అద్వైత్, త్రిశూర్‌కు చెందిన డాక్టర్ అజ్మల్ ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు. వీరు ఆస్పత్రిలో విధులు ముగించుకొని శనివారం రాత్రి ఇళ్లకు బయల్దేరారు. వీరితో పాటు డాక్టర్ తబ్సిర్, ఎంబీబీఎస్ విద్యార్థిని తమన్నా, నర్స్ జిస్మాన్ కూడా హోండా సివిక్ కారులో ఎక్కారు. డాక్టర్ అద్వైత్ డ్రైవింగ్ సీట్లో కూర్చొన్నాడు. మర్నాడు అతడి పుట్టిన రోజు. దీంతో వారు కొంచెం షాపింగ్ చేసి తిరుగు ప్రయాణమయ్యారు. ప్రయాణ సమయంలో భారీ వర్షం పడుతుండటంతో రోడ్డు మార్గం సరిగా కనిపించడంలేదు. అద్వైత్ జీపీఎస్ అనుసరించి డ్రైవింగ్ చేస్తున్నట్లు అతడి పక్కన కూర్చొన్న ఎంబీబీఎస్ విద్యార్థిని తమన్నా చెప్పింది. ఈ క్రమంలో జీపీఎస్ రీరూటైంది. దానిని అనుసరించిన అతడు మార్గం మధ్యలో నీరు నిలిచి ఉన్న ప్రాంతాన్ని రోడ్డుగా భ్రమించాడు. కారును నేరుగా నీటిలోకి తీసుకెళ్లాడు. అది నది అని గుర్తించేలోపే వారి కారు నీటిలో మునిగిపోయింది. ఈ ఘటన అర్ధరాత్రి 12.30 సమయంలో చోటు చేసుకొంది. స్థానికులు స్పందించి ముగ్గురిని రక్షించారు. అద్వైత్, అజ్మల్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. జీపీఎస్ సాధారణంగా తక్కువ ట్రాఫిక్ ఉన్న వైపు మార్గాన్ని సూచిస్తుంటుందని.. ఆ మార్గాలు అంత సురక్షితమైనవి కాదని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

