Andhra Pradesh: 1,01,56,116.. వామ్మో ఇదేంటి ఇన్ని అంకెలున్నాయ్.. కరెంట్ బిల్లు చూసి దెబ్బకు షాక్..
అదో చిన్న నగల దుకాణం.. మహా అయితే కరెంట్ బిల్లు ఓ వెయ్యో.. లేక ఐదో వేల రూపాయలో బిల్లు వస్తుంది.. ఇంకా మహా అయితే పది వేలో, 20 వేల రూపాయల బిల్లు వస్తుంది.. కానీ, ఇక్కడ ఇలా జరగలేదు.. విద్యుత్ సిబ్బంది ప్రతినెలా మాదిరిగానే బిల్లు రీడింగ్ తీసి.. నగల వ్యాపారికి ఇచ్చారు.. దీంతో అతను బిల్లును పెద్దగా గమనించకుండానే ప్రతినెలా మాదిరిగానే తీసుకున్నాడు.. సరేలే అని.. తాపిగా బిల్లు వంక చూశాడు..
అదో చిన్న నగల దుకాణం.. మహా అయితే కరెంట్ బిల్లు ఓ వెయ్యో.. లేక ఐదో వేల రూపాయలో బిల్లు వస్తుంది.. ఇంకా మహా అయితే పది వేలో, 20 వేల రూపాయల బిల్లు వస్తుంది.. కానీ, ఇక్కడ ఇలా జరగలేదు.. విద్యుత్ సిబ్బంది ప్రతినెలా మాదిరిగానే బిల్లు రీడింగ్ తీసి.. నగల వ్యాపారికి ఇచ్చారు.. దీంతో అతను బిల్లును పెద్దగా గమనించకుండానే ప్రతినెలా మాదిరిగానే తీసుకున్నాడు.. సరేలే అని.. తాపిగా బిల్లు వంక చూశాడు.. ఇంకెముంది దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది.. 1.. 2.. 3.. 4.. అనేలా.. ఎనిమిది అంకెలు కనిపించాయి.. దీంతో వ్యాపారి ఇదేంటని.. మరోసారి చూశాడు.. బిల్లు ఎప్పటిలా వేలల్లో కాకుండా.. లక్షల్లో కనిపిస్తుందేంటి..? అని మరోసారి చెక్ చేశాడు.. ఒకట్లు.. పదులు.. వందలు.. వేలు.. లక్ష.. పది లక్షలు.. కోటి.. అంటూ లేక్కేశాడు.. ఇంకెముంది వామ్మో.. కరెంటు బిల్లు కోటి రూపాయలు దాటిందా..! అంటూ అతని నోట మాట రాలేదు.. మీరు చదువుతున్నదంతా నిజమే.. ఓ చిన్న నగల దుకాణానికి కరెంటు బిల్లు అక్షరాల కోటి లక్ష రూపాయలు దాటింది.. ఈ షాకింగ్ ఘటన ఎక్కడో కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పట్టణంలోని పాలకొండ రోడ్డులో జి. అశోక్ దుర్గా జువెలర్స్ అనే పేరుతో నగల దుకాణం నిర్వహిస్తున్నాడు.. ఈ క్రమంలో ప్రతినెలా మాదిరిగానే విద్యుత్ సిబ్బంది షాపునకు వచ్చారు. సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 2 వరకు నగల దుకాణం వినియోగానికి సంబంధించిన బిల్లు రీడింగ్ తీశారు. అనంతరం సిబ్బంది బిల్లును వ్యాపారికి ఇచ్చారు. కోటి రూపాయలకు పైగా కరెంటు బిల్లు రావడంతో షాపు యజమాని ఒక్కసారిగా షాకయ్యాడు. సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 2 వరకు వినియోగించిన విద్యుత్‌కు రూ.1,01,56,116 బిల్లు వచ్చింది. అది చూసి ఇదేంటంటూ విద్యుత్ సిబ్బందిని ప్రశ్నించాడు. వారు ఉన్నతాధికారులను సంప్రదించాలంటూ సమాధానమిచ్చారు. దీంతో అతను బిల్లును తీసుకుని విద్యుత్ ఉన్నతాధికారుల దగ్గరకు వెళ్లాడు.
తాను నిర్వహిస్తున్న దుకాణానికి సగటున నెలకు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు బిల్లు వస్తుందని దుర్గా జువెలర్స్ యజమాని అశోక్ తెలిపాడు. బిల్లుపై విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నించగా పరిశీలించి కొత్త బిల్లు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపాడు. కాగా.. అంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల బిల్లు రీడింగ్ మారి ఎక్కువగా వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..