Angallu Violence Case: అంగళ్లు కేసులో టీడీపీ నేతలకు ఊరట.. ఆరు పిటీషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు..

అంగళ్లు కేసులో తెలుగుదేశం పార్టీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంగళ్లు ఘటనలో తెలుగుదేశం నేతలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ అనంతరం హైకోర్టు తెలుగుదేశం నేతలకు బెయిల్‌ మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది.

Angallu Violence Case: అంగళ్లు కేసులో టీడీపీ నేతలకు ఊరట.. ఆరు పిటీషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు..
Chandrababu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 03, 2023 | 12:14 PM

అంగళ్లు కేసులో తెలుగుదేశం పార్టీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంగళ్లు ఘటనలో తెలుగుదేశం నేతలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ అనంతరం హైకోర్టు తెలుగుదేశం నేతలకు బెయిల్‌ మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 6 వేర్వేరు పిటిషన్లను రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది. టీడీపీ నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, చల్లా రామచంద్రారెడ్డి అలియాస్‌ చల్లా బాబు, నల్లారి కిషోర్‌ కుమర్‌ రెడ్డిలకు మంజూరు చేసిన బెయిల్‌‌ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. చల్లా బాబుకు వ్యతిరేకంగా నాలుగు పిటషన్లు దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. పలు కీలక వివరాలను పిటిషన్‌లో పేర్కొంది. అయితే, అంగళ్లు కేసును మంగళవారం విచారించిన జస్టిస్‌ అనిరుద్ద బోస్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేది సుప్రీం ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌పై పలు అనుమానాలు వ్యక్తం చేసింది.

ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. భద్రత కల్పించే పోలీసులే.. సాక్షులుగా ఎఫ్‌ఐఆర్‌ ఏంటంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ఈ క్రమంలో స్పందించిన ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది.. అంగళ్లు ఘటనలో పోలీసు అధికారులు గాయపడ్డారని, ఓ కానిస్టేబుల్ ఫిర్యాదుదారుగా ఉన్నారని న్యాయస్థానానికి వివరించారు. పోలీసులే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. పోలీసులే.. సాక్షులుగా ఉంటారా అంటూ ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు బెయిల్‌ ఇచ్చింది కావున.. దానిలో జోక్యం చేసుకోడానికి ఏమీ లేదంటూ సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఆరు వేర్వేరు పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..