పసుపు బోర్డు కోసం.. పుష్కర కాలంగా చెప్పులు లేకుండా దీక్ష.. మోదీ ప్రకటనతో బహుమతిగా..

గతంలో రైతు మనోహర్ శంకర్ రెడ్డి 11 వారాల దీక్ష యాత్ర కూడా చేపట్టారు. ఆయన పర్యటన సందర్భంగా ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. ఈ విధంగా ఆయనకు 'పసుపు మనోహర్ రెడ్డి' అనే పేరు వచ్చింది. ఈ సమయంలో అతని పరిస్థితిని చూసిన గ్రామస్తులు, శ్రేయోభిలాషులు శంకర్‌రెడ్డిని శపథం చేసి చెప్పులు తొడుక్కోవాలని సూచించారు. కానీ,

పసుపు బోర్డు కోసం.. పుష్కర కాలంగా చెప్పులు లేకుండా దీక్ష.. మోదీ ప్రకటనతో బహుమతిగా..
Turmeric Farmer
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 03, 2023 | 11:51 AM

దేశంలోని పసుపు రైతులకు తెలంగాణ నేల నుండే బహుమతి ప్రకటించారు ప్రధాని మోదీ. జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన యావత్‌ తెలంగాణ ప్రజలతో పాటుగా దేశంలోని పసుపు రైతులందరికీ ఉపశమనం, సంతోషకరమైన వార్త. కానీ ఆ రైతుకు ఇది అతిపెద్ద శుభవార్త. అతడి తీర్మానం నెరవేరిందన్న సంతోషకర అంశం. అవును, రైతు ముత్యాల మనోహర్‌రెడ్డి అనే రైతుకు ఇది శుభవార్త కంటే పెద్ద వార్త.. ఎందుకంటే దీని కోసం అతను ఒక తీర్మానం తీసుకున్నాడు. పుష్కరకాలంగా అతడు చేసిన తీర్మానం కోసం వేచి ఉన్నాడు. ఇంతకీ ఎవరా రైతు.. ఏంటా తీర్మానం.. వివరాల్లోకి వెళితే…

మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రకటన చేశారు. దీంతో నాలుగేళ్ల క్రితం బీజేపీ ఇచ్చిన హామీని నెరవేర్చారు. అయితే ఈ హామీ నెరవేరకముందే మనోహర్ శంకర్ రెడ్డి అనే రైతు రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే వరకు చెప్పులు లేకుండా నడుస్తానని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ ప్రకటనతో ఆయన తీర్మానం నెరవేరింది. కానీ దురదృష్టం ఏంటంటే నేడు శంకర్ రెడ్డికి వ్యవసాయం చేసేందుకు భూమి లేదు. వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు తన భూమి మొత్తాన్ని అమ్మేశాడు రైతు మనోహర్‌ శంకర్‌ రెడ్డి.

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో నివాసముంటున్న మనోహర్ శంకర్ పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని గతంలోనే డిమాండ్‌ చేశారు. స్వయంగా పసుపును కూడా సాగు చేసేవాడు. పసుపు బోర్డు ఏర్పాటు చేసేంత వరకు బూట్లు, చెప్పులు వేసుకోనని 2011 నవంబర్ 4న ప్రతిజ్ఞ చేశారు. అంతే కాదు బోర్డు మెంబర్ కావాలనే కోరికతో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ నుంచి తిరుపతిలోని వేంకటేశ్వరుని పాదాల వరకు 63 రోజుల పాటు పాదయాత్ర కూడా చేశారు. మనోహర్ శంకర్ రెడ్డి టీవీలో పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన విన్న వెంటనే, ఇదంతా దేవుడి దయ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. బోర్డు ప్రకటన తర్వాత శంకర్‌రెడ్డికి రైతులు కొత్త చెప్పు బహుమతిగా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

గతంలో రైతు మనోహర్ శంకర్ రెడ్డి 11 వారాల దీక్ష యాత్ర కూడా చేపట్టారు. ఆయన పర్యటన సందర్భంగా ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. ఈ విధంగా ఆయనకు ‘పసుపు మనోహర్ రెడ్డి’ అనే పేరు వచ్చింది. ఈ సమయంలో అతని పరిస్థితిని చూసిన గ్రామస్తులు, శ్రేయోభిలాషులు శంకర్‌రెడ్డిని శపథం చేసి చెప్పులు తొడుక్కోవాలని సూచించారు. కానీ, శంకర్‌రెడ్డి ఎవరి మాట వినలేదు. చివరకు బోర్డు ప్రకటన తర్వాత శంకర్‌రెడ్డికి రైతులు కొత్త చెప్పు బహుమతిగా ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..