AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Arrest: చంద్రబాబు క్వాష్ పిటీషన్‌‌‌పై విచారణ వాయిదా.. మళ్లీ విచారణ ఎప్పుడంటే..?

చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వచ్చే సోమవారం దీనిపై విచారణ జరుపుతామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అంతకుముందు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై వాడీవేడి వాదనలు జరిగాయి.

Chandrababu Arrest: చంద్రబాబు క్వాష్ పిటీషన్‌‌‌పై విచారణ వాయిదా.. మళ్లీ విచారణ ఎప్పుడంటే..?
Chandrababu Naidu
Shaik Madar Saheb
|

Updated on: Oct 03, 2023 | 1:56 PM

Share

చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వచ్చే సోమవారం (అక్టోబర్ 9న) దీనిపై విచారణ జరుపుతామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అంతకుముందు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై వాడీవేడి వాదనలు జరిగాయి. బాబు క్వాష్ పిటిషన్‌ విచారణ సందర్భంగా.. 17A చుట్టూ వాదనలు కొనసాగాయి. 17A వర్తిస్తుందని చంద్రబాబు లాయర్లు వాదించగా.. వర్తించదని సీఐడీ తరపున లాయర్లు వాదించారు. కీలక వాదనల అనంతరం ధర్మాసనం క్వాష్ పిటీషన్‌పై తీర్పును వాయిదా వేసింది. చంద్రబాబు తరపున సీనియర్ లాయర్లు అభిషేక్‌ సింఘ్వి, హరీష్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా.. సీఐడీ తరపున ముకల్ రోహత్గీ.. జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా త్రివేది బెంచ్‌ ముందు వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లను ప్రస్తావిస్తూ వాదనలు కొనసాగాయి.

చంద్రబాబుకు 17A వర్తిస్తుందని.. మెరిట్స్ జోలికి వెళ్లడం లేదని చంద్రబాబు తరపున లాయర్లు వాదించారు. సెక్షన్ 17A ఉద్దేశం కక్షసాధింపు నుంచి రక్షణ అని.. పార్లమెంట్‌ నేతలకు ఇచ్చిన రక్షణను తుంగలో తొక్కారని పేర్కొన్నారు. కేబినెట్‌ నిర్ణయాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీస్కోవాలని.. అన్ని కేసుల్లో సెక్షన్‌ 17A రక్షణ కల్పిస్తుందని వివరించారు.

దీనికి సీఐడీ తరపున లాయర్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబుకు 17A వర్తించదని.. క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని పేర్కొన్నారు. 2018లో సెక్షన్‌ 17A అమల్లోకి వచ్చిందని.. వందల కోట్ల దుర్వినియోగం జరిగిందని వివరించారు. ఈ కేసుకి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని.. ఏడాది జాప్యం తర్వాత కేసు నమోదైందంటూ వివరించారు.

FIRలో పేరు, గవర్నర్‌ పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేశారని సాల్వే వాదించగా.. అన్ని ఆధారాలున్నాయని, అన్ని ప్రక్రియలు పాటించామని రోహత్గీ వివరించారు. 900 పేజీల డాక్యుమెంట్‌ను కోర్టులో దాఖలు చేశారని.. పథకం ప్రకారమే స్కిల్ డవెలప్‌మెంట్ స్కామ్ జరిగిందని సీఐడీ లాయర్‌ వాదించారు. విచారణ కీలక దశలో ఉన్నప్పుడు ఈ పిటిషన్‌పై విచారణ జరపకూడదంటూ పేర్కొన్నారు. స్కిల్‌ సెంటర్లు పెట్టకుండానే నిధులు విడుదల చేశారతీ.. 6 షెల్‌ కంపెనీలకు డబ్బులు తరలించారతీ సీఐడీ తరపున లాయర్‌ పేర్కొన్నారు. ప్రతీకారానికి దిగితే ఎప్పుడో అరెస్ట్‌ చేసేవారని.. ఆధారాలు ఉన్నాయి కాబట్టే చర్యలు తీసుకున్నారంటూ వివరించారు.

కాగా.. ఇరు వైపులా వాదనల అనంతరం ధర్మాసనం.. హైకోర్టు ముందున్న డాక్యుమెంట్ల కంపైలేషన్ తమకు అందజేయాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది రోహత్గీకి ఆదేశించింది.

సుప్రీంకోర్టుకు వెళ్లకు ముందుకు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. సీఐడీ వాదనలతో ఏపీ హైకోర్టు ఏకీభవిస్తూ..క్వాష్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. అప్పుడు అసలు చంద్రబాబు తరఫున, సీఐడీ తరఫున కూడా వాడీవేడీ వాదనలు జరిగాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే