Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. ఎమ్మెల్యే మాగంటి సోదరుడి ఇంట్లో తనిఖీలు..

Hyderabad, October 05: హైదరాబాద్‌లో మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మాగంటి గోపీనాథ్ బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. మొత్తం 100 ఐటీ బృందాలు నగరం వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. పలు కంపెనీలు, వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

Telangana: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. ఎమ్మెల్యే మాగంటి సోదరుడి ఇంట్లో తనిఖీలు..
IT Raids
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 05, 2023 | 9:26 AM

Hyderabad, October 05: హైదరాబాద్‌లో మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మాగంటి గోపీనాథ్ బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. మొత్తం 100 ఐటీ బృందాలు నగరం వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. పలు కంపెనీలు, వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. కూకట్‌పల్లిలోని ఓ విల్లాస్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు. బుధవారం సాయంత్రానికే దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఐటీ అధికారులు భారీగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇంత భారీ సంఖ్యలో ఐటీ అధికారులు రావడంతో.. గట్టి టార్గెటే ఉందని అంతా అనుకున్నారు. అందరూ అనుకున్నట్లుగానే.. ఉదయమే తమ పని మొదలు పెట్టారు ఐటీ అధికారులు. నిర్ణీత వ్యక్తులు, నాయకులు, ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణలో పొలిటికల్ వార్..

తెలంగాణలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది. ప్రధాని మోదీ వచ్చి వెళ్లడం.. ఆ వెంటనే ఐటీ రైడ్స్ జరుగడంతో పరిస్థితి మరింత ఇంట్రస్టింగ్‌గా మారింది. ఎన్నికలు ఎక్కడుంటే.. అక్కడికి మోదీ, అమిత్‌ షా వెళ్తారని, వారు వెళ్లిన వెంటనే ఐటీ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రవేశిస్తాయని విపక్ష నేతలు ఎప్పుడూ విమర్శలు గుప్పిస్తుంటారు. వారి విమర్శలకు తగ్గట్లుగానే నేటి సీన్ నడుస్తోంది. మొన్న మహబూబ్‌నగర్, నిజామాబాద్ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం టార్గెట్‌గా ప్రధాని మోదీ సంచలన అవినీతి ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణ దరిమిలా.. వెంటనే హైదరాబాద్‌లోకి ఐటీ ప్రవేశించింది. బీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.

ప్రధాన ఉద్దేశం ఇదేనా?

తెలంగాణలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ.. ఇక్కడి అధికార బీఆర్‌ఎస్ పార్టీని దెబ్బకొట్టాలని భావిస్తోంది. అసలే ఎన్నికల కాలం. ఈ ఎన్నికల సీజన్‌లో ఏ పార్టీకైనా ఫండింగ్ చాలా ముఖ్యం. ఆ ఫండింగే అందకుండా కట్ చేస్తే.. బీఆర్‌ఎస్‌కు కోలుకోలేని దెబ్బ తగులుతుందని బీజేపీ భావిస్తోందట. ఈ నేపథ్యంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్‌కు ఎన్నికల ఫండింగ్ అందించే అవకాశం ఉన్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, కాంట్రాక్టర్లే టార్గెట్‌గా ఐటీ సోదాలు జరుగుతున్నాయని అంటున్నారు.

తమిళనాడులోనూ దాడులు..

మరోవైపు తమిళనాడులో కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని 70 ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపడుతున్నారు. డీఎంకే ఎంపీ జగన్ రక్షకన్ ఆఫీస్, ఇంట్లో సోదాలు నిర్వహించారు. అలాగే పలు హోటళ్లు, ప్రైవేట్ ఆస్పత్రులపైనా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆ మూవీని రిలీజ్ చేయద్దు.. శివసేన హెచ్చరిక..ఇంతకీ ఏముందీ సినిమాలో?
ఆ మూవీని రిలీజ్ చేయద్దు.. శివసేన హెచ్చరిక..ఇంతకీ ఏముందీ సినిమాలో?
సింక్ డ్రెయిన్ శుభ్రం చేయడానికి బెస్ట్ క్లీనింగ్ టిప్స్..!
సింక్ డ్రెయిన్ శుభ్రం చేయడానికి బెస్ట్ క్లీనింగ్ టిప్స్..!
ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్.. 2 జట్లతో ఏకంగా 12 మ్యాచ్‌లు
ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్.. 2 జట్లతో ఏకంగా 12 మ్యాచ్‌లు
మెట్లు ఎక్కేటప్పుడు కీళ్ల నొప్పులు వస్తున్నాయా.. నిపుణులు సలహా
మెట్లు ఎక్కేటప్పుడు కీళ్ల నొప్పులు వస్తున్నాయా.. నిపుణులు సలహా
హైస్పీడ్ రైలు.. హైదరాబాద్ నుండి బెంగళూరు కేవలం 2 గంటల్లోనే..!
హైస్పీడ్ రైలు.. హైదరాబాద్ నుండి బెంగళూరు కేవలం 2 గంటల్లోనే..!
అందాలతో మెస్మరైజ్ చేస్తున్న జ్యోతిక..బ్యూటిఫుల్ ఫొటోస్
అందాలతో మెస్మరైజ్ చేస్తున్న జ్యోతిక..బ్యూటిఫుల్ ఫొటోస్
బాహుబలి సినిమాను రిజక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
బాహుబలి సినిమాను రిజక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
జపాన్‌ను భయపెడుతున్న అతి భారీ భూకంపం.. సునామీ కూడా..!
జపాన్‌ను భయపెడుతున్న అతి భారీ భూకంపం.. సునామీ కూడా..!
సమ్మర్‌లో మీ శరీరం ఎప్పుడూ చల్లగా ఉండాలంటే పాటించాల్సిన టిప్స్ ఇవ
సమ్మర్‌లో మీ శరీరం ఎప్పుడూ చల్లగా ఉండాలంటే పాటించాల్సిన టిప్స్ ఇవ
వాహనదారులకు షాక్‌.. ఈ కారు ధర రూ.62 వేలు పెంపు..ఏ మోడల్‌కు ఎంతంటే
వాహనదారులకు షాక్‌.. ఈ కారు ధర రూ.62 వేలు పెంపు..ఏ మోడల్‌కు ఎంతంటే