AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telanagana: తెలంగాణ దేవుళ్లకు ఐటీ షాక్.. కొమురవెల్లి మల్లన్న సహా పలు ప్రముఖ దేవాలయాలకు నోటీసులు

తెలంగాణలోని పలు ప్రముఖ దేవాలయాలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆదాయపు పన్ను కట్టాలంటూ నోటీసులు పంపించింది. ఈ జాబితాలో కొమురవెల్లి మల్లన్న స్వామి తొలి స్థానంలో ఉన్నారు. రూ. 8 కోట్ల ట్యాక్స్ కట్టాలని, సకాలంలో పన్ను కట్టనందువల్ల మరో రూ. 3 కోట్ల జరిమానా కూడా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Telanagana: తెలంగాణ దేవుళ్లకు ఐటీ షాక్.. కొమురవెల్లి మల్లన్న సహా పలు ప్రముఖ దేవాలయాలకు నోటీసులు
Telangana Temples
Vijay Saatha
| Edited By: |

Updated on: Oct 05, 2023 | 11:13 AM

Share

తెలంగాణ దేవుళ్లకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. అదేంటి దేవుళ్లకు ఐటి షాక్ ఏంటని పరేషాన్ అవుతున్నారా.. నిజమే తెలంగాణలో ప్రముఖ దేవులందరికి ఐటి శాఖ నోటీసులు ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో దేవుళ్ళకే ఐటీ నోటీసులు అన్న చర్చ ప్రారంభమైంది. ఆదాయపు పన్ను కట్టాలంటూ ఆలయాలకు ఐటీ నోటీసులు ఇవ్వటంతో సంచలనం గా మారింది. ప్రముఖ దేవస్థానం కొమురవెల్లి మల్లన్నకు రూ.11 కోట్లు కట్టాలంటు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. కొమురెల్లి మల్లన్న దేవాలయానికి కాదు తెలంగాణలో దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ రాజన్న టెంపుల్ తో పాటు చదువుల నిలయమైన బాసర సరస్వతి ఆలయానికి సైతం నోటీసులు పంపింది ఆదాయపన్ను శాఖ.

దేవాలయా లే టార్గెట్

తెలంగాణలోని పలు ప్రముఖ దేవాలయాలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆదాయపు పన్ను కట్టాలంటూ నోటీసులు పంపించింది. ఈ జాబితాలో కొమురవెల్లి మల్లన్న స్వామి తొలి స్థానంలో ఉన్నారు. రూ. 8 కోట్ల ట్యాక్స్ కట్టాలని, సకాలంలో పన్ను కట్టనందువల్ల మరో రూ. 3 కోట్ల జరిమానా కూడా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వేములవాడ రాజన్న, బాసరలోని సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు ఇంకా పలు దేవాలయాలకు కూడా నోటీసులు అందాయి.

మరోవైపు ఆలయాలకు ఐటీ నోటీసులు అందడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, వ్యక్తుల విషయంలో వ్యవహరించినట్టు ఆలయాలపై కఠిన వైఖరిని అవలంభించడం సమంజసం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
డెలాయిట్‌లో మంచి జాబ్ వదిలి ఇండస్ట్రీకి వచ్చాడు.. ఇప్పుడు ఆయనే..
డెలాయిట్‌లో మంచి జాబ్ వదిలి ఇండస్ట్రీకి వచ్చాడు.. ఇప్పుడు ఆయనే..
ప్రెగ్నెంట్ అయినా ఫిట్‌నెస్‌ తప్పనిసరి అంటున్న నటి
ప్రెగ్నెంట్ అయినా ఫిట్‌నెస్‌ తప్పనిసరి అంటున్న నటి
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. థియేటర్లలో యూత్ ఎగబడి చూశారు
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. థియేటర్లలో యూత్ ఎగబడి చూశారు
సబ్జా vs చియా సీడ్స్.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
సబ్జా vs చియా సీడ్స్.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
మంట పుట్టిస్తున్న సమ్మర్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మంట పుట్టిస్తున్న సమ్మర్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
కోపాన్ని మోస్తుంటే ఏం జరుగుతుందో సైకాలజిస్టుల మాట
కోపాన్ని మోస్తుంటే ఏం జరుగుతుందో సైకాలజిస్టుల మాట
అక్బర్, టిప్పు సుల్తాన్ మెచ్చిన రాజరికపు రుచి.. వీధి చిరుతిండి..
అక్బర్, టిప్పు సుల్తాన్ మెచ్చిన రాజరికపు రుచి.. వీధి చిరుతిండి..
అందం కోసం ఆరాటంలో జెన్‌ ఆల్ఫా.. కోల్పోతున్నది ఏంటి
అందం కోసం ఆరాటంలో జెన్‌ ఆల్ఫా.. కోల్పోతున్నది ఏంటి
ఉచ్ఛ స్థితితో రవి.. ఆ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..!
ఉచ్ఛ స్థితితో రవి.. ఆ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..!
ఇంటర్ ఫలితాల్లో2026 అమ్మాయిల సత్తా.. మేడ్చల్‌ జిల్లా టాప్!
ఇంటర్ ఫలితాల్లో2026 అమ్మాయిల సత్తా.. మేడ్చల్‌ జిల్లా టాప్!