Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizianagaram: వల బలంగా అనిపిస్తే భారీగా చేపలు పడ్డాయని సంబరపడ్డారు.. తీరా బయటకు తీస్తే..

చంపావతి నదిలో చేపల వేటకు వెళ్లారు ముగ్గురు మత్స్యకారులు. నదిలో వల వేసి చేపల చిక్కడం కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండు గంటలకు వల చాలా బరువెక్కింది. ఏదో పెద్ద చేపే పడిందని అందరూ సంతోషపడ్డారు. వలను బలంగా పైకి లాగుతుంటే వలకు చిక్కిన ప్రాణి కూడా అంతే బలంగా కిందకు లాగుతూ పట్టుబడుతుంది. దీంతో ఆ వలను ముగ్గురు మత్స్యకారులు లాగలేకపోవడంతో మరో ముగ్గురు వ్యక్తుల సాయం తీసుకొని మొత్తానికి వలను పైకి లాగారు.

Vizianagaram: వల బలంగా అనిపిస్తే భారీగా చేపలు పడ్డాయని సంబరపడ్డారు.. తీరా బయటకు తీస్తే..
Fisherman
Follow us
G Koteswara Rao

| Edited By: Surya Kala

Updated on: Oct 05, 2023 | 1:02 PM

సముద్రంలోకి లేదా నదిలోకి వేటకు వెళ్లే ప్రతి మత్సకారుడు.. ఈ రోజు తమ వలలో ఎక్కువ చేపలు పడాలని..అదృష్టం ఉంటె అరుదైన చేపలు చిక్కి తమ ఇంట కాసుల సిరులు కురవాలని కోరుకుంటాడు. రోజూ చేపల వేటకు వెళ్లి తమ వలలో పడిన చేపలతో ఆనందంగా ఇంటికి తిరిగి వస్తారు. అయితే కొందరు  మత్స్యకారులు ఎప్పటిలానే నదిలో చేపల వేటకు వెళ్లారు… అయితే ఊహించని  విధంగా వారికీ షాక్‌ తగిలింది. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంట సమీపంలో సెప్టెంబర్‌ 4న సాయంత్రం నాలుగు గంటలకు చంపావతి నదిలో చేపల వేటకు వెళ్లారు ముగ్గురు మత్స్యకారులు. నదిలో వల వేసి చేపల చిక్కడం కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండు గంటలకు వల చాలా బరువెక్కింది. ఏదో పెద్ద చేపే పడిందని అందరూ సంతోషపడ్డారు. వలను బలంగా పైకి లాగుతుంటే వలకు చిక్కిన ప్రాణి కూడా అంతే బలంగా కిందకు లాగుతూ పట్టుబడుతుంది. దీంతో ఆ వలను ముగ్గురు మత్స్యకారులు లాగలేకపోవడంతో మరో ముగ్గురు వ్యక్తుల సాయం తీసుకొని మొత్తానికి వలను పైకి లాగారు. ఆ తర్వాత వలలో చిక్కిన పెద్ద జీవిని చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ వలలో ఉంది చేపలు కాదు పెద్ద కొండచిలువ.

సుమారు పదిహేను అడుగుల పొడవున్న ఆ కొండచిలువ వలలోనుంచే ఒక్కసారిగా మత్స్యకారుల పై దాడికి యత్నించింది. దీంతో భయపడిన మత్స్యకారులు అక్కడ నుండి పరుగులు తీశారు. చేసేదిలేక వెంటనే స్నేక్ క్యాచర్ కి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ కొండచిలువను వలనుంచి తప్పించి తీసుకెళ్లి సమీపంలోనే కొండ ప్రాంతంలో వదిలిపెట్టాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పుడూ తాము చేపలు పట్టే చంపావతి నదిలో కొండచిలువ పడటంతో భయాందోళనకు గురైన మత్స్యకారులు అటు వైపు వేటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అంతేకాదు ఇటీవల వచ్చిన వరదలు, వర్షలకు కొండల నుంచి, అడవుల నుంచి వచ్చిన ఈ కొండచిలువలు నది సమీపంలోని చేపలను తింటూ జీవిస్తున్నాయని అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..