AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Price: భారీగా పతనమైన టమాటా ధర.. ఒక టీ కొనాలన్నా.. రైతు 30 కేజీలు అమ్మాల్సిందే..

ఒకొక్కసారి ఉల్లి, టమాటా, వంటి పంటలకు భారీ డిమాండ్ నెలకొని.. ఒక్కసారిగా కిలో వంద అన్నా దొరకని పరిస్థితి నెలకొంటుంది. అప్పుడు అన్నదాత పంట చేతికి రాదు.. తీరా పంట చేతికి అంది వచ్చిన తర్వాత కిలో వంద మాట దేవుడెరుగు.. కనీసం పంటకు పెట్టిన పెట్టుబడి.. మార్కెట్ కు తీసుకుని వెళ్లిన రవాణా ఖర్చులు వస్తే చాలు దేవుడా అంటూ రైతు కోరుకుంటాడు అని అంటే అతిశయోక్తి కాదు..

Tomato Price: భారీగా పతనమైన టమాటా ధర.. ఒక టీ కొనాలన్నా.. రైతు 30 కేజీలు అమ్మాల్సిందే..
Tomato Price
Surya Kala
|

Updated on: Oct 05, 2023 | 12:10 PM

Share

జై కిసాన్ అన్నది మన నినాదం.. అయితే అందరికి అన్నం పెట్టె అన్నదాత కండుపునిండా తిన్నాడు.. కంటి నిండా నిద్రపోతాడు అని అనుకంటె పొరపాటే.. రైతన్న పంటలపై ప్రకృతి కూడా పగబడుతుంది. ఒకొక్కసారి అతి వృష్టి.. మరొకసారి అనావృష్టితో పంటలు పండడంపై అనుమానమే.. ఇక పండిన పంట చేతికి వచ్చే సమయంలో గిట్టుబాటు ధర రావాలి.. లేకుండా వ్యవసాయం దండగే అనుకుంటాడు రైతన్న.. ఒకొక్కసారి ఉల్లి, టమాటా, వంటి పంటలకు భారీ డిమాండ్ నెలకొని.. ఒక్కసారిగా కిలో వంద అన్నా దొరకని పరిస్థితి నెలకొంటుంది. అప్పుడు అన్నదాత పంట చేతికి రాదు.. తీరా పంట చేతికి అంది వచ్చిన తర్వాత కిలో వంద మాట దేవుడెరుగు.. కనీసం పంటకు పెట్టిన పెట్టుబడి.. మార్కెట్ కు తీసుకుని వెళ్లిన రవాణా ఖర్చులు వస్తే చాలు దేవుడా అంటూ రైతు కోరుకుంటాడు అని అంటే అతిశయోక్తి కాదు.. ఇటీవల దేశ వ్యాప్తంగా టమాటాకు భారీ డిమాండ్ నెలకొంది. అప్పుడు టమాటా రైతులు కొందరు కోటీశ్వరులు కూడా అయ్యారు కూడా. అయితే కేవలం కొన్ని రోజుల్లోనే టమాటా ధర భారీ పడిపోయింది. ఎంతగా అంటే.. కిలో టమాటా అమ్మితే రైతు కనీసం టీ కప్పు కూడా కొనుక్కోలేని స్టేజ్ కు చేరుకున్నది.

అవును ఏపీలో టమాటా ధర దారుణంగా పడిపోయింది. కర్నూలు జిల్లాలోని పత్తికొండ మార్కెట్లో కిలో టమోటా 30 పైసలు పలుకుతోంది. బహిరంగ మార్కెట్ లో కిలో రూ. 20 ఉన్నాయా.. మార్కెట్లో మాత్రం రోజు రోజుకు  టమోటా ధర పతనం అవుతోంది. అయితే వారం రోజుల క్రితం టమోటాల్ని ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తుందని మార్కెట్ యార్డ్ అధికారులు చెప్పారు. కానీ ఈ హామీ అమల్లోకి రాలేదని టమాటా రైతులు వాపోతున్నారు. పూర్తిస్థాయిలో పతనమైన టమోటా ధర తగ్గినా మార్కెట్ యార్డ్ అధికారులు  పట్టించుకోవడం లేదంటూ టమాటా  రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమను ప్రభుత్వం ఆదుకోవాలని.. టమాటా పంటకు కనీసం గిట్టుబాటు ధర కల్పించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫ్రెండ్‌ కోసం సూపర్‌‌ హిట్ కథ వదులుకున్న ప్రభాస్‌
ఫ్రెండ్‌ కోసం సూపర్‌‌ హిట్ కథ వదులుకున్న ప్రభాస్‌
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్.. ఆ తోపు టీంలకే సాధ్యంకాలే
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్.. ఆ తోపు టీంలకే సాధ్యంకాలే
సడెన్‌గా కాఫీ తాగడం మానేస్తే.. శరీరంలో జరిగే మార్పులేంటి? వాటికి
సడెన్‌గా కాఫీ తాగడం మానేస్తే.. శరీరంలో జరిగే మార్పులేంటి? వాటికి
పామును మరో పాము కరిస్తే ఏమవుతుంది..? అవి చనిపోతాయా లేక బతుకుతాయా
పామును మరో పాము కరిస్తే ఏమవుతుంది..? అవి చనిపోతాయా లేక బతుకుతాయా
ఎన్టీఆర్ పితృ సమానులుగా భావించింది ఆయన్నే...
ఎన్టీఆర్ పితృ సమానులుగా భావించింది ఆయన్నే...
అకాల మరణం పొందితే ఆ ఆత్మలు భూలోకంలోనే తిరుగుతాయా.. గరుడ పురాణం..
అకాల మరణం పొందితే ఆ ఆత్మలు భూలోకంలోనే తిరుగుతాయా.. గరుడ పురాణం..
ఒకప్పుడు బాత్రూమ్స్ కడిగాడు.. ఇప్పుడీ జబర్దస్త్ నటుడు కోటీశ్వరుడు
ఒకప్పుడు బాత్రూమ్స్ కడిగాడు.. ఇప్పుడీ జబర్దస్త్ నటుడు కోటీశ్వరుడు
శ్రీవారి సన్నిధిలో ఫోటో షూట్.. క్షమాపణ చెప్పిన కొత్తజంట
శ్రీవారి సన్నిధిలో ఫోటో షూట్.. క్షమాపణ చెప్పిన కొత్తజంట
చికెన్ 65 కి అసలు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
చికెన్ 65 కి అసలు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
నుమాయిష్‌లో వంటల పోటీలు.. మీ చేతి రుచి చూపేందుకు సిద్దమా?
నుమాయిష్‌లో వంటల పోటీలు.. మీ చేతి రుచి చూపేందుకు సిద్దమా?