APSRTC: ప్రయాణికులకు అలర్ట్.. దసరా పండుగ వేళ కీలక ప్రకటన చేసిన ఏపీఎస్ఆర్టీసీ..
Vijayawada, October 05: దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా కర్నాటకలోని స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం 5,500 ప్రత్యేక సర్వీసులు సిద్ధంచేస్తున్నారు. ఈ నెల 13 నుండి 26 వరకు.. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నడపనుండి. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది.

Vijayawada, October 05: దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా కర్నాటకలోని స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం 5,500 ప్రత్యేక సర్వీసులు సిద్ధంచేస్తున్నారు. ఈ నెల 13 నుండి 26 వరకు.. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నడపనుండి. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దసరా రద్దీని దృష్టిలో పెట్టుకుని 5,500 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు 2,700 బస్సులు, 23 నుంచి 26 వరకు 2,800 బస్సులు నడపనున్నారు. దసరాకు ముందు హైదరాబాద్ నుంచి 2,050, బెంగళూరు నుంచి 440, చెన్నై నుంచి 153 బస్సులు ఏపీలోని వివిధ నగరాలు, పట్టణాలకు సర్వీసు అందిస్తాయి. రాష్ట్ర పరిధిలో విజయవాడ నుంచి 885 బస్సులు, విశాఖ నుంచి 480, రాజమహేంద్రవరం నుంచి 355 కలిపి మొత్తం 1,137 ప్రత్యేక బస్సులను వివిధ జిల్లాలకు నడుపుతారు. వీటిలో సాధారణ ఛార్జీలే ఉంటాయని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. రాకపోకలకు కలిపి ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే 10 శాతం రాయితీ కూడా లభిస్తుందని పేర్కొంది. చిల్లర సమస్య లేకుండా యూటీఎస్ యంత్రాల ద్వారా ప్రయాణికులు ఫోన్‌పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కానింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించి టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలిపింది.
ఈ నెల 22న దుర్గాష్టమి.. 23 నవమి, దశమి రోజుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా ఉంటుంది. ఏపీలోని ఇతర ప్రాంతాలకు విజయవాడ నుంచి తిరిగే అన్ని సర్వీసులను యధావిధిగా నడుపనున్నారు. తెలంగాణ, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు పెద్ద ఎత్తున ప్రయాణికులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఆర్టీసీ సాధారణ రోజుల్లో నడిపే బస్సులతో పాటు పండుగ రోజుల్లో ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. చెన్నై , హైదరాబాద్, బెంగుళూరు పొరుగు రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని ఇతర ముఖ్య ప్రాంతాలకు కూడా అదనంగా ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. విజయవాడ , రాజమహేంద్రవరం విశాఖ , కర్నూలు, చైన్నై , బెంగుళురు, తిరుపతి, అనంతపురం, విజయనగరం, కాకినాడ, భీమవరం, అమలాపురం, కడప, భద్రాచలం, శ్రీశైలం, మార్కాపురం, ఒంగోలు, తుని, శ్రీకాకుళం, నెల్లూరు ప్రాంతాలకు కలిపి 5,550 ప్రత్యేక బస్సులు నడుపనుంది.
సాధారణ ఛార్జీలే..
ప్రయాణికులపై పండుగ రోజుల్లో భారం పడకూడదని గత రెండేళ్లుగా సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది కూడా ఇదే విధంగా నడిపేందుకు సిద్ధమయ్యారు. తద్వారా ప్రయాణికులకు ఆర్థిక వెసులుబాటు కలిపించారు.
మరోవైపు ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు అధికారులు అవకాశం కల్పించారు. రాను, పోను ముందస్తు రిజర్వేషన్ చేయించుకునే ప్రయాణికులకు ఛార్జీలో 10శాతం రాయితీని ఆర్టీసీ కల్పించింది. ఏటీబీ ఏజెంట్లు, ఆర్టీసీ యాప్, ఆన్‌లైన్ విధానంలో ఈ వెసులుబాటు పొందచ్చని అధికారులు తెలిపారు.
రద్దీగా ఉన్న రోజుల్లో ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా అధికారులు, సూపర్ వైజర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక బస్సులు పర్యవేక్షణకు జిల్లా ముఖ్య కేంద్రాలు, హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో అధికారులు, సూపర్ వైజర్లు, సెక్యూరిటీ, సిబ్బంది విధులు నిర్వహిచనున్నారు. అన్ని బస్సులకు జీపీఎస్ ట్రాకింగ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు 24 గంటల సమాచారం అందించేందుకు, ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించేందుకు కాల్ సెంటర్ 149తో పాటు 0866-2570005 ఫోన్‌ను అందుబాటులో ఉంచనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..