పానకం ధర కోటి రూపాయలుపైనే… మొట్టమొదటి సారి కోటి మార్క్ దాటింది…
సాధారణంగా బహిరంగ వేలంతో పాటు సీల్డ్ కవర్ టెండర్, అదే విధంగా ఈ వేలం ద్వారా ఈ పాటలను అధికారులు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది పాటను కోటి పదకొండు లక్షల అరవై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలకు పాలడుగు నాగలక్ష్మీ ఈ వేలంలో దక్కించుకుంది. మొదట బహిరంగ వేలం నిర్వహించగా మహేష్ అనే పాటదారుడు 99.70 లక్షలు పాట పాడాడు. ఆ తర్వాత సీల్డ్ కవర్ టెండర్స్ ఓపెన్ చేయగా శ్యామ్ అనే వ్యక్తి కోటి పదిలక్షలు కోట్ చేశాడు.

మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహాస్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. కొండపై నెలకొన్న పానకాల స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. అయితే నరసింహస్వామి ఇక్కడ మూడు రూపాల్లో కొలువై ఉన్నారు. మంగళాద్రి కొండ దిగువున లక్ష్మీ నరసింహ స్వామిగా కొలువై ఉండగా.. కొండ మధ్యలో పానకాల స్వామిగా.. కొండపైన గండాలయ్య స్వామిగా కొలువుదీరి ఉన్నారు. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న భక్తులు తమ బాధలు తీరితే పానకం సమర్పిస్తామని మొక్కుకుంటారు. అందుకే కొండ మధ్యలో ఉన్న స్వామికి పానకాల స్వామిగా పేరు వచ్చింది. అయితే ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది. ఎంత పానకం పోస్తామో అందులో సగం వెనుదిరిగి వస్తుందని భక్తులు నమ్ముతుంటారు. దీంతో భక్తులు వచ్చి పానకం సమర్పించడం అనవాయితీ గా వస్తుంది.
ఈ క్రమంలోనే ప్రతి ఏటా పానకం తయారు చేసి విక్రయించేందుకు దేవదాయ శాఖాధికారులు వేలం పాటలు నిర్వహిస్తారు. ఏడాది కాలనికి పాట జరుగుతుంది. వేలం పాట దక్కించుకున్న వ్యక్తి ఏడాది పాటు ఆలయంలో పానకం విక్రయించుకోవచ్చు. సాధారణంగా ఒక్కో లీటర్ పానకం అరవై రూపాయలకు విక్రయిస్తుంటారు. భక్తులు తాకిడి ఎక్కువుగా ఉండటం.. వచ్చిన ప్రతి భక్తుడు పానకం సమర్పిస్తుండటంతో ఇక్కడి పానకానికి అధిక డిమాండ్ ఉంటుంది. దీంతో పాటదారులు అధిక మొత్తంలో చెల్లించేందుకు సిద్దమవుతుంటారు.
సాధారణంగా బహిరంగ వేలంతో పాటు సీల్డ్ కవర్ టెండర్, అదే విధంగా ఈ వేలం ద్వారా ఈ పాటలను అధికారులు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది పాటను కోటి పదకొండు లక్షల అరవై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలకు పాలడుగు నాగలక్ష్మీ ఈ వేలంలో దక్కించుకుంది. మొదట బహిరంగ వేలం నిర్వహించగా మహేష్ అనే పాటదారుడు 99.70 లక్షలు పాట పాడాడు. ఆ తర్వాత సీల్డ్ కవర్ టెండర్స్ ఓపెన్ చేయగా శ్యామ్ అనే వ్యక్తి కోటి పదిలక్షలు కోట్ చేశాడు. అనంతరం ఈ టెండర్స్ ఓపెన్ చేయగా నాగలక్ష్మీ కోటి పదకొండు లక్షల అరవై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలు కోట్ చేసింది. ఆమెకే పానకం పాటను అధికారులు ఖరారు చేశారు.
గత ఏడాది పానకం పాట ద్వారా 88,22,999 రూపాయల ఆదాయం రాగా మొదటి సారి మాత్రం కోటి రూపాయల మార్క్ దాటింది. అయితే వేలం పాటలను అధిక ధరలకు దక్కించుకోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాట దక్కించుకున్న పాట దారులు వాటిని భక్తుల వద్ద నుండే వసూలు చేస్తున్నారని మండి పడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
