- Telugu News Photo Gallery Harmonizing Faiths: Celebrating Interfaith Harmony Day with Second Murti Pratishtha at BAPS Swaminarayan Akshardham
BAPS Swaminarayan Akshardham: అక్షరధామ్‌లో ‘ఇంటర్‌ఫేస్ హ్యుమానిటీ డే’.. వైభవంగా దేవతామూర్తుల ప్రతిష్ఠాపన వేడుక..
అమెరికాలో ఇండియన్ కమ్యూనిటీ ఆధ్యాత్మిక పరంగా చాలా బలంగా ఉంది. వారి కార్యకలాపాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అక్కడ దైవ మందిరాల నిర్మాణం 150 ఏళ్ల కిందటే మొదలైంది. అవన్నీ ఒక ఎత్తయితే.. BAPS స్వామినారాయణ్ అక్షర్‌ధామ్ ఒక్కటీ ఒక ఎత్తు. మహంత్ స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో ఇప్పటికే ప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడవ రోజున దేవతామూర్తుల ప్రతిష్ఠాపన వేడుక జరిగింది..
Updated on: Oct 05, 2023 | 7:21 PM

ఆధ్యాత్మికత, ఆధునికత, స్వచ్ఛత కలగలసిన అద్భుత క్షేత్రం.. ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద హిందూ దేవాలయం... BAPS స్వామినారాయణ్ అక్షర్‌ధామ్... కేరాఫ్ నార్త్ అమెరికా.. న్యూజెర్సీ రాష్ట్రం... రాబిన్స్‌విల్లె పట్టణం.. ఈనెల 8న ప్రారంభం కాబోతోంది. అద్భుతమైన ఈ గుడి ప్రాంగణం, అంతరాలయం నుంచి ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ ఇస్తోంది.

న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లేలోని BAPS స్వామినారాయణ్ అక్షరధామ్‌లో మూర్తి ప్రతిష్ఠా వేడుక ఘనంగా జరిగింది. ఇవాళ మూడు రోజున రెండవ మహంత్ స్వామి మహారాజ్ అధ్యక్షతన జరిగింది.

BAPS సంప్రదాయానికి చెందిన ఆధ్యాత్మిక నాయకులు. గురువుల దివ్య విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ శుభ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తిథి క్షేత్ర ట్రస్ట్‌తో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ పవిత్ర వేడుకలో పిల్లన గ్రోవితో శ్రీకృష్ణుడు, సీతా రాముల వారి విగ్రహాలతో పాటు శివ పార్వతుల విగ్రహాలను BAPS సంప్రదాయం ప్రకారం దేవతామూర్తులకు ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు.

ఈ సందర్బంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి స్వామిజీ పాల్గొన్నారు. సభను ఉద్దేశించి ఆయన ఇలా అన్నారు. స్వామి నారాయణ అక్షరధామ్ ఆలయాం ఒక లైట్‌హౌస్ వంటిదని అన్నారు.

విగ్రహ ప్రతిష్టాపన వేడుకలో పెద్ద భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 'ఇంటర్‌ఫేస్ హ్యుమానిటీ డే'లో ప్రముఖులు మాట్లాడారు.

క్కడి నుంచి వచ్చే కాంతి కిరణం.. బంధం అనే జ్ఞానం రూపంలో తర తరాలవారికి ప్రసారిస్తుందన్నారు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి స్వామిజీ. ఇది మానవతా దేవాలయం, అంతేకాదు ఇది విశ్వాసాని ఆలయం, సార్వత్రిక ప్రేమ, సామరస్యతకు ఇది నెలవు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇస్లాం, క్రైస్తవం, జుడాయిజం, హిందూ, జైన, సిక్కు, బౌద్ధ మతాలపై చర్చ జరిగింది. ఒక్కసారి ఇక్కడికి రండి అంటూ వారంతా కలిసి ప్రపంచానికి పిలుపునిచ్చారు. భిన్నత్వంలో ఏకత్వం, మానవత్వం అనే అక్షరధామ్ ప్రాథమిక సూత్రాలకు ఈ సమావేశమే నిదర్శనం అని తెలిపారు.





























