మారుతి ఎస్-ప్రెస్సో.. దీనిలో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 65.7 బీహెచ్పీ, 89 ఎన్ఎం శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనిలోనూ 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్(ఏఎంటీ) ఉంటుంది. ఇది ఆల్టో కంటే విశాలమైన ఇంటీరియర్‌ను అందిస్తుంది, నలుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా ఉండేందుకు అనువుగా ఉంటుంది. దీని ధర పరిధి రూ. 5.76 లక్షల నుంచి రూ. 6.05 లక్షలు వరకూ ఉంటుంది.