Heart Health: ఈ అల్పాహార అలవాట్లు మీ గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి.. జాగ్రత్త
ముఖ్యంగా అనారోగ్యకరమైన అల్పాహారం ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, గుండె జబ్బులకు దారితీస్తుంది. ప్రస్తుతం చాలా మంది చిప్స్, జంక్ ఫుడ్‌లు తింటున్నారు. ఇది ఆరోగ్యకరమైన ఆహారం ప్రయోజనాలను కూడా తగ్గిస్తుంది. అలాగే ఇది స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అనారోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌లు తినే వ్యక్తులు వేగంగా బరువు పెరుగుతారు. అలాగే స్ట్రోక్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది..
Updated on: Oct 05, 2023 | 7:01 PM

ఒక కొత్త అధ్యయనం షాకింగ్ ఫలితాలతో వచ్చింది. అల్పాహారం పోషక నాణ్యత, సమయం రెండూ మీ ఆరోగ్యంపై భారీ ప్రభావాన్ని చూపుతాయి.

ముఖ్యంగా అనారోగ్యకరమైన అల్పాహారం ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, గుండె జబ్బులకు దారితీస్తుంది. ప్రస్తుతం చాలా మంది చిప్స్, జంక్ ఫుడ్‌లు తింటున్నారు. ఇది ఆరోగ్యకరమైన ఆహారం ప్రయోజనాలను కూడా తగ్గిస్తుంది. అలాగే ఇది స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

అనారోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌లు తినే వ్యక్తులు వేగంగా బరువు పెరుగుతారు. అలాగే స్ట్రోక్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఇలాంటి జంక్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న రోజుల్లో గుండె జబ్బులు పెరిగిపోతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మంచి పోషకాలున్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఈ రోజుల్లో చాలా ముఖ్యమంటున్నారు.

మనం తినే ఆహారం నాణ్యతను బట్టి మన ఆరోగ్యం బాగుందో, చెడ్డదో నిర్ణయిస్తుంది. రోజూ పండ్లు, కూరగాయలు, పప్పులు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. (నోట్: ఈ కథనంలో నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. వీటిని అనుసరించే ముందు నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)





























