- Telugu News Photo Gallery Sports photos Indian Cricketer Sachin Tendulkar 10 Inspiring Quotes On Dreams and victory In Telugu Telugu Sports Photos
Sachin Tendulkar: ఆటలోనే కాదు జీవితంలోనూ సత్తా చాటాలా..? సచిన్ టెండుల్కర్ స్ఫూర్తి సందేశాలు.
క్రికెట్ వరల్డ్ కప్ పోటీల నేపథ్యంలో భారత్‌లో క్రికెట్ ఫీవర్ తారస్థాయికి చేరింది. కోట్లాది మంది అభిమానాన్ని పొందిన క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్.. పలు సందర్భాల్లో విజయం, కలల సాకారంపై కీలక సందేశాలు ఇచ్చారు. ఆయన చెప్పిన విజయ సూత్రాలను ఒకసారి చూద్దాం.
Updated on: Oct 05, 2023 | 4:56 PM

మీ కలలను ఛేజింగ్ చేయడం ఆపకండి.. ఎందుకంటే కలలు సాకారం అవుతాయి.

ఎదుటి వాళ్లు మీపై రాళ్లు విసిరితే.. మీరు వాటిని మైలురాళ్లుగా మార్చుకోండి.

ఎప్పుడూ ఇంకొరితో నన్ను పోల్చుకునేందుకు ప్రయత్నించలేదు.

క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందుగా మీరు స్థిరంగా ఉండాలి.. మీ ప్రవృత్తిని అనుసరించాలి.. స్పష్టంగా ఆలోచించాలి.

వరల్డ్ కప్‌ను గెలుచుకోవడం ఒక ప్రక్రియ. ఒకేసారి నేరుగా 50వ ఫ్లోర్‌కి జంప్ చేయలేం.. కింది అంతస్థు నుంచే మొదలుపెట్టాలి..

ప్రతి ఒక్కరికీ సొంత స్టైల్ ఉంటుంది. మైదానం లోపల, మైదానం బయట వారిని వ్యక్తీకరించే విధానంలోనూ మార్పు ఉంటుంది.

సుదూర లక్ష్యాల గురించి ఎక్కువగా ఆలోచించను.. ఒక సమయంలో ఒక లక్ష్యంపైనే ఎక్కువ ఆలోచిస్తాను.

మీ లక్ష్యాలను నిర్దేశించుకోండి.. అయితే దీన్ని సాధించేందుకు అడ్డదారులు వెతకొద్దు.

ఇప్పుడు నేను ఈ స్థితలో ఉన్నానంటే దానికి నాలోని పోటీతత్వమే కారణం.

గెలుపు గొప్ప అనుభూతి ఎందుకు ఇస్తుందంటే.. దాని వెనుక చాలా మంది కృషి ఉంటుంది.





























