AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro tips for Luck: అక్టోబర్ 19 నుంచి వీరి జాతకం మారిపోనుంది.. పట్టిందల్లా బంగారమే ఇక..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలు రాశి మారినప్పుడు శుభ, అశుభ యోగాలు కలుగుతాయి. ముఖ్యంగా కొన్ని యోగాలు మన జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం అలాంటి యోగమే ఏర్పడుతుంది. దాని ప్రభావం 12 రాశుల పైనా ఉంటుంది. వాస్తవానికి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహా తమ రాశిని ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. దీన్నే స్థాన చలనం అంటారు.

Astro tips for Luck: అక్టోబర్ 19 నుంచి వీరి జాతకం మారిపోనుంది.. పట్టిందల్లా బంగారమే ఇక..
Zodiac Signs In Telugu
Shiva Prajapati
|

Updated on: Oct 06, 2023 | 1:18 AM

Share

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలు రాశి మారినప్పుడు శుభ, అశుభ యోగాలు కలుగుతాయి. ముఖ్యంగా కొన్ని యోగాలు మన జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం అలాంటి యోగమే ఏర్పడుతుంది. దాని ప్రభావం 12 రాశుల పైనా ఉంటుంది. వాస్తవానికి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహా తమ రాశిని ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. దీన్నే స్థాన చలనం అంటారు. కొన్నిసార్లు ఈ గ్రహాలు స్థాన చలనం సమయంలో మరొక గ్రాహంతో కలుస్తాయి. కొన్ని సార్లు విరుద్ధంగా పరిస్థితి ఉంటుంది. దీన్నే గ్రహా సంయోగం, తిరోగమనం అని పిలుస్తుంటారు. ఈ గమనం, గ్రహాల కలయిక వలన శుభ, అశుభ యోగాలు ఏర్పాడుతాయి. ఇకపోతే.. గ్రహాల రాజు అయిన సూర్యుడు తన రాశిని మారబోతున్నాడు. మార్చి అక్టోబర్ 17న తులా రాశిలో ప్రవేశిస్తున్నాడు. అదే సమయంలో అక్టోబర్ 19వ తేదీన గ్రహాల రాకుమారుడిగా పిలువబడే బుధుడు కూడా తన రాశిని మార్చుకుని తులారాశిలో ప్రవేశిస్తాడు. దీని కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని కల్పిస్తుంది. అక్టోబర్ 19వ తేదీ తరువాత వారి జీవితంలో అన్నీ శుభ పరిణామాలే ఉంటాయి. మరి ఆ రాశులు ఏంటో ఓసారి చూద్దాం.

కన్య: బుధాదిత్య రాజయోగం కన్యారాశికి లాభాలను ఇస్తుంది. ఈ సమయంలో మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ఏది అనుకున్నా అది జరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

ధనస్సు రాశి : ఈ యోగం వల్ల మీకు విజయం లభిస్తుంది. ఏదైనా రంగంలో పెట్టుబడి పెడితే భారీ రాబడులు వస్తాయి. వ్యాపారులు కొన్ని పనులను పూర్తి చేయడం ద్వారా లాభం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మకరం: బుధాదిత్య రాజయోగం మకరరాశి వారికి వరంలాంటింది. ఈ సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది. అలాగే, మీరు వివిధ వనరుల నుండి డబ్బు సంపాదిస్తారు. మీరు ఆస్తిని కూడా కొనుగోలు చేయవచ్చు.

కటక రాశి : ఈ యోగం మీ జీవితంలో గొప్ప మలుపునిస్తుందని చెప్పవచ్చు. బుధాదిత్య రాజయోగం మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..