- Telugu News Photo Gallery BAPS Swaminarayan Akshardham celebrates significant contributions of Indian American women in Robbinsville, New Jersey
Akshardham Mandir: BAPS స్వామినారాయణ్ అక్షరధామ్‌లో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..
ప్రపంచంలోనే అతిపెద్ద రెండో హిందూ దేవాలయం అమెరికాలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లె టౌన్‌లో బీఏపీఎస్ స్వామినారాయణ్ అక్షర్‌ధామ్‌గా పిలుచుకునే ఈ ఆలయం అద్భుతంగా రూపుదిద్దుకుంది. అమెరికా వ్యాప్తంగా తరలివచ్చిన మహిళలు ఇక్కడ జరుగుతున్న వేడుకల్లో ప్రత్యేకంగా నిలిచారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. భారతీయ అమెరికన్ మహిళల సహకారంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
Updated on: Oct 04, 2023 | 9:23 PM

భారత్ వెలుపల నిర్మితమైన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలోని న్యూజెర్సీలో అక్టోబర్ 8వ తేదీన ప్రారంభం కానుంది. న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లె టౌన్‌లో బీఏపీఎస్ స్వామినారాయణ్ అక్షర్‌ధామ్‌గా పిలుచుకునే ఈ గుడి అద్భుతంగా రూపుదిద్దుకుంది.

అక్షరధామ్ ఆలయ ప్రతిష్ఠాపన వేడుక ఘనంగా జరుగుతోంది. సెప్టెంబరు 30 నుంచి స్వామినారాయణ్ పవిత్ర మహంత్ స్వామి మహారాజ్ సమక్షంలో ఈ వేడుకలు జరగుతున్నాయి.

ఉత్తర అమెరికా అంతటి నుంచి వచ్చిన మహిళలు BAPS స్వామినారాయణ అక్షరధామ్‌లో "మహిళల విరాళాల వేడుక"లో పాల్గొన్నారు, ఈ ఈవెంట్‌ను మహిళలే స్వయంగా నిర్వహించారు. భారతీయ అమెరికన్ మహిళలు తాము నివసిస్తున్న అమెరికన్ కమ్యూనిటీల ఫాబ్రిక్‌కు చేసిన విశేష కృషిని ఇక్కడ ప్రదర్శించారు.

అక్షరధామ్ ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమయ్యాయి. మహంత్ స్వామి మహారాజ్ సమక్షంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల అధినేతలు, నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకల్లో ఇవాళ జరిగిన కార్యక్రమంలో చిన్నారు ప్రత్యేక ఆకర్శనగా నిలిచారు. భారతీయ వస్త్రధారణలో మెరిసిపోయారు. పూజ కోసం రాగి కలశాలతో ఆలయంలోకి ప్రవేశించారు.

43 మంది భారతీయ ఎన్నారై మహిళలు ప్రదర్శించిన సింఫొనీ ఈవెంట్ అద్భుతంగా సాగింది. అనంతరం జరిగిన నృత్య ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి.

ఇక్కడ జరిగిన వేడకల్లో భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న నాట్య, నృత్య రీతులను భారతీయ నాట్యం, భారతీయ నృత్యం వంటి నాట్యరీతులను ఇక్కడ ప్రదర్శించారు.

200 వందల మందికి పై ఈ నృత్యాల్లో మహిళలు పాల్గొన్నారు. వారు ప్రదర్శించిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.
