- Telugu News Photo Gallery Health Benefits of Lemongrass Tea: Why lemongrass tea must be a part of your diet, Know here
Lemongrass Tea: రోజూ ఉదయాన్నే ఈ టీ తాగారంటే ఒత్తిడి, ఆందోళన పరార్!
ఒక కప్పు వేడి టీ తాగితే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. ఒత్తిడి, టెన్షన్ నుంచి ఉపశమనం పొందడానికి అనేక మంది టీ తగుతుంటారు. పాలతో తయారు చేసిన టీ కంటే లెమన్ గ్రాస్ టీ తాగితే మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. లెమన్ గ్రాస్ టీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. లెమన్ గ్రాస్ టీ సువాసన నాడీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. లెమన్‌గ్రాస్ టీ ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలోనూ..
Updated on: Oct 04, 2023 | 9:02 PM

ఒక కప్పు వేడి టీ తాగితే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. ఒత్తిడి, టెన్షన్ నుంచి ఉపశమనం పొందడానికి అనేక మంది టీ తగుతుంటారు. పాలతో తయారు చేసిన టీ కంటే లెమన్ గ్రాస్ టీ తాగితే మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

లెమన్ గ్రాస్ టీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. లెమన్ గ్రాస్ టీ సువాసన నాడీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. లెమన్‌గ్రాస్ టీ ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

లెమన్ గ్రాస్ టీ వల్ల ఒత్తిడిని తగ్గించడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. లెమన్‌గ్రాస్ టీ సహజమైన డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన అన్ని కాలుష్య కారకాలను మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

తరచుగా గ్యాస్-గుండె మంట సమస్యలతో బాధపడేవారు లెమన్‌గ్రాస్ టీ తాగవచ్చు. ఇది పొట్ట సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం, కడుపునొప్పి, గుండెల్లో మంట, మలబద్ధకం వంటి గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి లెమన్‌గ్రాస్ టీ తాగవచ్చు. లెమన్ గ్రాస్‌లో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మ కణాలను రక్షిస్తాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధులు, వృద్ధాప్య ప్రమాదాన్ని దరిచేరకుండా నివారిస్తుంది.

లెమన్ గ్రాస్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది వివిధ రకాల క్యాన్సర్లు, ఆర్థరైటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. లెమన్‌గ్రాస్ టీ తాగడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంచుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.




