Diabetes Control Diet: డయాబెటిస్‌ను అదుపులో ఉంచాలంటే ప్రతిరోజూ అల్లం, లవంగాలు, పసుపు..
రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే మధుమేహం సమస్య తలెత్తుతుంది. నేటి జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే మధుమేహం సమస్యతో అనేక మంది బాధపడుతున్నారు. మధుమేహంతో బాధపడేవారు కేవలం మందులు తీసుకోవడం ద్వారా మాత్రమే వ్యాధిని నియంత్రించలేదు. షుగర్‌ని నియంత్రించడానికి అనేక ఆయుర్వేద మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.. ఇందులో మెంతికూర ముఖ్యమైనది. మెంతికూరలో ఫైబర్ అధికంగా..
Updated on: Oct 04, 2023 | 8:46 PM

రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే మధుమేహం సమస్య తలెత్తుతుంది. నేటి జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే మధుమేహం సమస్యతో అనేక మంది బాధపడుతున్నారు. మధుమేహంతో బాధపడేవారు కేవలం మందులు తీసుకోవడం ద్వారా మాత్రమే వ్యాధిని నియంత్రించలేదు. షుగర్‌ని నియంత్రించడానికి అనేక ఆయుర్వేద మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

ఇందులో మెంతికూర ముఖ్యమైనది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. మెంతి నీళ్లు లేదా మెంతి పొడిని నీటిలో కలిపి తాగితే మేలు జరుగుతుంది. మీరు మెంతి టీ కూడా తాగవచ్చు.

పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. పసుపు కూడా ఇన్సులిన్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి మీరు మదుమేహంతో బాధపడుతుంటే ప్రతిరోజూ ఉదయం పచ్చి పసుపును తినడం వల్ల ప్రయోజనం పొందవచ్చు.

అల్లం కూడా మధుమేహాన్ని నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. అల్లంలో ఇన్సులిన్‌ను నియంత్రించడంలో సహాయపడే సమ్మేళనాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఆహారంలో భాగంగా అల్లం తినవచ్చు లేదా అల్లంతో టీ తయారు చేసుకుని కూడా సేవించవచ్చు.

మధుమేహంతో బాధపడేవారు లవంగాలు కూడా తీసుకోవచ్చు. లవంగాల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చక్కెరను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. కాబట్టి మీకు డయాబెటిస్ సమస్య ఉంటే లవంగాలతో తయారు చేసిన టీ లేదా పచ్చిగా నమిలి తిన్నా ప్రయోజనం ఉంటుంది.




