- Telugu News Photo Gallery Hypertension: How Many Types Of High Blood Pressure? How To Control Hypertension? Know here
Hypertension: అధిక రక్తపోటు ఇలా కూడా వస్తుంది..! వెంటనే ఈ అలవాట్లు మార్చుకోకపోతే మీరూ..
అధిక రక్తపోటు ప్రభావం నేరుగా గుండెలోని ధమనులను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ధమనుల్లో రక్తం వేగంగా ప్రవహిస్తుంది. అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, గుండె ఒత్తిడికి గురవుతుంది. అప్పుడు రక్తాన్ని పంప్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందువల్లనే అధిక రక్తపోటు గుండెపోటుకు దారి తీస్తుంది. ప్రస్తుతం కాలంలో అనేక రకాల ఒత్తిడితో బాధపడుతున్నారు. పనిలో ఒత్తిడి, సరైన విశ్రాంతి, నిద్రకు లేకపోవడం వల్ల అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతుంటాయి..
Updated on: Oct 04, 2023 | 8:24 PM

అధిక రక్తపోటు ప్రభావం నేరుగా గుండెలోని ధమనులను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ధమనుల్లో రక్తం వేగంగా ప్రవహిస్తుంది. అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, గుండె ఒత్తిడికి గురవుతుంది. అప్పుడు రక్తాన్ని పంప్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందువల్లనే అధిక రక్తపోటు గుండెపోటుకు దారి తీస్తుంది. ప్రస్తుతం కాలంలో అనేక రకాల ఒత్తిడితో బాధపడుతున్నారు. పనిలో ఒత్తిడి, సరైన విశ్రాంతి, నిద్రకు లేకపోవడం వల్ల అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతుంటాయి.

తీవ్రమైన తలనొప్పి, తల మధ్యలో నొప్పి, ఛాతీ నొప్పి, మైకం, శ్వాస ఆడకపోవడం, ఆందోళన, వికారం వంటి అనేక ఇతర లక్షణాలు అధిక రక్తపోటు ఉన్నవారిలో కనిపిస్తాయి. ఇవి ప్రారంభ లక్షణాలు. చాలా సందర్భాలల్లో ఫ్యామిలీ హిస్టరీ వల్ల కూడా అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది.

అలాగే రోజువారీ జీవనశైలి, ఆహారం కూడా అధిక రక్తపోటును ప్రభావితం చేస్తుంది. నిత్యం బయట ఆహారం తినేవారిలో, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినేవారిలో, కనీస శారీరక వ్యాయామం చేయనివారిలో ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు మందులు కూడా అధిక రక్తపోటుకు కారణం కావచ్చు. అలాగే కాంప్లెక్స్ సర్జరీ జరిగినా, ధమనుల ద్వారా రక్తప్రసరణ ఆగిపోయినా, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినా, థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోయినా అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది.

రక్తపోటు ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారుతుంది. ఇది రక్తపోటు ఆకస్మిక పెరుగుదలకు కూడా కారణమవుతుంది. వృద్ధుల్లో సిస్టోలిక్ హైపర్‌టెన్షన్ సర్వసాధారణం. ధమనులు గట్టిపడటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. 140/90 mm సాధారణ రక్తపోటు. రక్తపోటు 130-139 mm లేదా 80-89 mm ఉంటే హైపర్‌టెన్షన్‌కు దారితీస్తుంది. వీరు మెడిసిన్ తీసుకోవల్సి ఉంటుంది. అయితే క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం, వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, సోడియం తక్కువగా తీసుకోవడం, బరువు నియంత్రణ వంటి వాటి ద్వారా ఇలాంటి సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు.

అధిక రక్తపోటు గుండెను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా శరీరంలోని ఇతర భాగాలకు రక్తం చేరదు. దీంతో గుండె ఆగిపోయే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించడం, ధూమపానం మానేయడం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం, తగినంత నిద్రపోవడం, బరువును అదుపులో ఉంచుకోవడం, రొటీన్ చెకప్‌లు వంటివి ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.




