Headlines Today: ఢిల్లీకి సీఎం జగన్.. నేటితో ముగియనున్న బాబు రిమాండ్.. నేటి నుంచే వరల్డ్ కప్
హాట్‌హాట్‌గా సాగుతున్నాయి ఏపీ రాజకీయాలు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. ఇటు తెలంగాణలో అధికారం సాధించేందుకు BRS సర్కారు చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు దీటుగా మిషన్ తెలంగాణను బీజేపీ తీవ్రతరం చేసినట్టు కనిపిస్తోంది. అటు వరల్డ్‌కప్ మెగా సమరం వచ్చేసింది. ఈ రోజు హెడ్ లైన్స్ చూద్దాం...
ఏపీ రాజకీయాలు ప్రస్తుతం హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రా సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. హస్తినలో 2 రోజులపాటు ముఖ్యమంత్రి పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ టూర్‌లో భాగంగా.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా.. ఆంధ్రాలోని తాజా పరిణామాలతోపాటు.. విభజన హామీలను ప్రస్తావించే ఛాన్స్ ఉంది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును..విజయవాడ ఏసీబీ కోర్టులో వర్చువల్‌గా హాజరుపరిచే అవకాశం ఉంది.
సిక్కిం, పశ్చిమబెంగాల్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. తీస్తా నది వరదలతో వచ్చిన ఆకస్మిక వరదలతో ఇప్పటికే పదిమంది చనిపోగా.. 82మంది గల్లంతయ్యారు. వీరిలో 23 మంది జవాన్ల ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు..సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది.
వరల్డ్‌కప్ మెగా సమరం వచ్చేసింది. పది టీమ్‌లు, 48 మ్యాచ్‌లు, 45 రోజులపాటు.. జరగనున్న ఈ భారీ టోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తోంది. ఈరోజు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అయితే ఓపెనింగ్ సెర్మనీ మాత్రం.. అక్టోబర్ 14కి వాయిదాపడింది.