Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మంచు దుప్పటి కప్పుకున్న ఔలిని తక్కువ ధరతో సందర్శించండి.. స్కీయింగ్ ఎంపిక

ఔలిలో ఉన్న పర్వతాల ఎత్తు దాదాపు 20 వేల అడుగులు. ఇక్కడికి చేరుకోవాలంటే జోషిమఠంకు ముందుగా చేరుకోవాలి.  జోషిమఠం నుండి ఔలి చేరుకోవడానికి మూడు దారులున్నాయి. మొదటి రోప్‌వే- ఈ మార్గంలో సాహసం చేస్తూ ప్రయాణం చేయాలనుకునేవారు ఈ రోప్ వే ద్వారా ఔలి చేరుకుంటారు. రోప్‌వేలో ఒక వ్యక్తికి రూ. 1,000 ఛార్జ్ చేస్తారు. ఔలికి రహదారి ద్వారా కూడా వెళ్ళవచ్చు, దీని దూరం 16 కిలోమీటర్లు. మూడవ మార్గం  కాలినడకన చేరుకోవచ్చు.

Viral Video: మంచు దుప్పటి కప్పుకున్న ఔలిని తక్కువ ధరతో సందర్శించండి.. స్కీయింగ్ ఎంపిక
Auli Adventure Travel
Follow us
Surya Kala

|

Updated on: Oct 12, 2023 | 12:08 PM

మంచు దుప్పటి కప్పుకుని శ్వేతవర్ణంతో మిలమిలా మెరిసే మంచును చూడటం.. మంచులో ప్రయాణం చేయడం మీకు ఇష్టమా.. అయితే మనదేశంలోని ఔలిని సందర్శించడానికి ప్లాన్ చేసుకోండి. మంచులో ఎంజాయ్ చెయ్యాలనే మీ కలలన్నీ ఔలిలో నెరవేరుతాయి. ఈ ప్రాంతం ఎంత అందంగా ఉంటుందంటే.. ఔలీని ఉత్తరాఖండ్ స్విట్జర్లాండ్ అంటారు. దేశంలోని అత్యంత ప్రసిద్ధ హిల్ స్టేషన్లలో ఒకటి ఔలి.

భారతదేశంలోని అత్యుత్తమ స్కీయింగ్ ప్రదేశాల్లో ఔలీ కూడా పరిగణించబడుతుంది. ఔలి ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉంది. సముద్ర మట్టానికి దీని ఎత్తు సుమారు 3 వేల మీటర్లు. పచ్చటి మైదానాలతో కూడిన ఔలి శీతాకాలంలో పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఔలిలోని పర్వతాల అద్భుతమైన వీక్షణను చూడడానికి ఎవరైనా ఇష్టపడతారు. ఇక్కడ అనేక రకాల సాహస కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

View this post on Instagram

A post shared by JustWravel™ (@justwravel)

ఔలిలో ఉన్న పర్వతాల ఎత్తు దాదాపు 20 వేల అడుగులు. ఇక్కడికి చేరుకోవాలంటే జోషిమఠంకు ముందుగా చేరుకోవాలి.  జోషిమఠం నుండి ఔలి చేరుకోవడానికి మూడు దారులున్నాయి. మొదటి రోప్‌వే- ఈ మార్గంలో సాహసం చేస్తూ ప్రయాణం చేయాలనుకునేవారు ఈ రోప్ వే ద్వారా ఔలి చేరుకుంటారు. రోప్‌వేలో ఒక వ్యక్తికి రూ. 1,000 ఛార్జ్ చేస్తారు. ఔలికి రహదారి ద్వారా కూడా వెళ్ళవచ్చు, దీని దూరం 16 కిలోమీటర్లు. మూడవ మార్గం  కాలినడకన చేరుకోవచ్చు. 8 కిలోమీటర్ల పొడవు నడిచి ఔలికి చేరుకోవాలి. అయితే ఇక్కడికి చేరుకోవడానికి రోప్‌వే ఉత్తమ మార్గం.

థ్రిల్ అనుభవం

ఔలి చేరుకున్న తర్వాత మంచు తో కప్పిన ఓ ఎత్తైన పర్వతం కనిపిస్తుంది. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని సేకరించడానికి హిమాలయాలకు వెళ్తూ..  అతను విశ్రాంతి తీసుకోవడానికి ఈ ప్రదేశంలో ఆగిపోయాడని చెబుతారు. ఇక్కడికి వెళ్లిన వారు హనుమంతుడు విశ్రాంతి తీసుకున్న ఆ ఆలయాన్ని కూడా చూడవచ్చు. సాహసాలు చేయడం ఇష్టపడేవారు ఔలిలో అనేక రకాల సాహస కార్యకార్యకలాపాలతో ఎంజాయ్ చేయవచ్చు. చాలా మందికి ఇక్కడ స్కీయింగ్ చేయడం అంటే ఇష్టం. అంతేకాదు మీరు ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు. ఔలి నుండి అనేక ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి.

 ఏ విషయాలపై శ్రద్ధ వహించాలంటే

మీరు జోషి మఠం నుండి బయలుదేరినప్పుడు నగదు విత్‌డ్రా చేసుకోండి. ఔలీలో డబ్బు విత్ డ్రా చేసుకునే సదుపాయం లేదా ఏటీఎం లేదు. మీరు ఔలికి రోడ్డు మార్గంలో వెళుతున్నట్లయితే, జోషి మఠం వద్ద మాత్రమే పెట్రోల్ నింపుకోండి. అతి తక్కువ ఖర్చుతో కూడా ఇక్కడ బస చేయవచ్చు. జోషి మఠం లో మీరు 500 రూపాయల మధ్య గదులను సులభంగా దొరుకుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..