Israel Hamas War: శవాల కుప్పలతో నిండిన గాజా.. మృత దేహాలను భద్రపరచడం కోసం ఐస్‌క్రీమ్ ట్రక్కులే మార్చురీ వ్యాన్లు

గాజాపై ఇజ్రాయెల్ దాడులు 10రోజులుగా కొనసాగుతున్నాయి. దాదాపు 2 వేల 600 మందికి పైగా పాలస్తీనియన్లు మృత్యువాతన పడ్డారు. కుప్పకూలుతున్న గాజాలో శిథిలాల కిందే మిగిలిపోతున్నాయి మృతదేహాలు. ఒకవేళ బైటికి తీసినా... ఆ మృతదేహాల్ని భద్రపరచడం ఒక పెద్ద సమస్యగా మారిందక్కడ. ఆస్పత్రుల్లో మార్చురీలు సరిపోకపోవడంతో.. మరో మార్గం లేక.. ఐస్‌క్రీమ్ ట్రక్కుల్లో మృతదేహాల్ని కుక్కేస్తున్నారు

Israel Hamas War: శవాల కుప్పలతో నిండిన గాజా.. మృత దేహాలను భద్రపరచడం కోసం ఐస్‌క్రీమ్ ట్రక్కులే మార్చురీ వ్యాన్లు
Ice Cream Trucks In Gaza
Follow us
Surya Kala

|

Updated on: Oct 17, 2023 | 10:47 AM

గాజాలో మరణమృదంగం ఇప్పట్లో ఆగేలా లేదు. వేలాదిమంది సామాన్యజనం నేలకొరుగుతున్నారు. ఇంతకంటే విషాదం ఏంటంటే.. అక్కడ మృతదేహాలను భద్రపరిచేందుకు చోటు సరిపోవడం లేదు. ఐస్‌క్రీమ్ టక్కుల్నే మార్చురీలుగా వినియోగించాల్సిన మహా దురవస్థ. గాజాపై ఇజ్రాయెల్ దాడులు 10 రోజులుగా కొనసాగుతున్నాయి. దాదాపు 2 వేల 600 మందికి పైగా పాలస్తీనియన్లు మృత్యువాతన పడ్డారు. కుప్పకూలుతున్న గాజాలో శిథిలాల కిందే మిగిలిపోతున్నాయి మృతదేహాలు. ఒకవేళ బైటికి తీసినా… ఆ మృతదేహాల్ని భద్రపరచడం ఒక పెద్ద సమస్యగా మారిందక్కడ.

ఆస్పత్రుల్లో మార్చురీలు సరిపోకపోవడంతో.. మరో మార్గం లేక.. ఐస్‌క్రీమ్ ట్రక్కుల్లో మృతదేహాల్ని కుక్కేస్తున్నారు. డెయిల్ ఆఫ్ బలాహ్ ప్రాంతంలో ఐతే ఆస్పత్రి వర్గాలు పూర్తిగా చేతులెత్తేసి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఐస్‌క్రీమ్ ట్రక్కులే మార్చురీ వ్యాన్లుగా మారిపొయ్యాయి.

బైట చూస్తే… పిల్లలు ఆనందంగా ఐస్‌క్రీమ్ తింటున్న ఫోటోలు. లోపల మాత్రం విధివంచితుల మృతదేహాలు. ఇదొక దయనీయ చిత్రం. ఈ ట్రక్కులు కూడా నిండిపోవడంతో… మిగతా మృతదేహాల్ని టెంట్ల కింద దాచేయాల్సిన పరిస్థితి. కనీసం మృతదేహాల్ని చుట్టే కవర్లు కూడా అందుబాటులో లేవు.

ఇవి కూడా చదవండి

గాజాలో క్షతగాత్రుల సమస్య కూడా భయానకంగా ఉంది. ఇజ్రాయెల్ రాకెట్ దాడుల్లో దాదాపు 8 వేల మంది తీవ్రంగా గాయపడి చికిత్స కోసం ఎదురుచూస్తున్నారు. కానీ.. ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ లేవు. మరోచోటికి ఎక్కడికీ తరలించే సదుపాయం కూడా లేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..