Israel Hamas War: ఇజ్రాయెల్ ముందు తలవంచిన హమాస్.. వైమానిక దాడులను ఆపమని ఇరాన్ డిమాండ్..
ఇరాన్ విదేశాంగ మంత్రి ఒక ప్రకటనలో ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఆపితే హమాస్ చెరలో బందీలను విడుదల చేస్తుందని వెల్లడించింది. ఇరాన్ చెప్పిన ప్రకారం హమాస్ చెరలో ఉన్న 200 మంది బందీలకు బదులుగా.. ఇజ్రాయెల్ తన జైళ్లలో ఉన్న వేలాది మందిని విడుదల చేయాలని హమాస్ డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోందని.. ఆ ఒత్తిడిని అమెరికా ఎదుర్కోలేకపోతుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అభిప్రాయపడ్డాడు.
హమాస్ మొదలు పెట్టిన దాడితో ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతుంది. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం గత వారం రోజులుగా కొనసాగుతూనే ఉంది. అయితే ఇరాన్ ఒక భారీ ప్రకటన వెలువడింది. ఇజ్రాయెల్ తమపై హమాస్ చేసిన దాడులకు ప్రతీకారంగా గాజాపై విరుచుకుపడుతుంది. ఈ దాడుల కారణంగా హమాస్ తలవంచిందని తెలుస్తోంది. ఎందుకంటే ఇరాన్ విదేశాంగ మంత్రి ఒక ప్రకటనలో ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఆపితే హమాస్ చెరలో బందీలను విడుదల చేస్తుందని వెల్లడించింది.
200 మంది బందీలకు బదులుగా
ఇరాన్ చెప్పిన ప్రకారం హమాస్ చెరలో ఉన్న 200 మంది బందీలకు బదులుగా.. ఇజ్రాయెల్ తన జైళ్లలో ఉన్న వేలాది మందిని విడుదల చేయాలని హమాస్ డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోందని.. ఆ ఒత్తిడిని అమెరికా ఎదుర్కోలేకపోతుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అభిప్రాయపడ్డాడు.
Sirens blare in Tel Aviv for third time in a day, at least 3 rockets intercepted
Read @ANI Story | https://t.co/BSnM8ifDbR#Sirens #TelAviv #Israel #IsraelHamasWar #IronDome pic.twitter.com/DE5hYLgjDY
— ANI Digital (@ani_digital) October 16, 2023
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి
అర్థరాత్రి కూడా హమాస్ ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడి చేసింది. ఈ సమయంలో అకస్మాత్తుగా సైరన్ మోగింది ఐదు సెకన్లలో అనేక రాకెట్లు కనిపించాయి. అయితే అప్పటికే ఇజ్రాయెల్ ఆ రాకెట్స్ ను ఐరన్ డోమ్‌తో కాల్చివేసింది. దీనిని చిత్రాలను కెమెరాలో బంధించారు. రఫా క్రాసింగ్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడి చేసిందని హమాస్ పేర్కొంది.
సామాన్యులు కూడా సైనికులకు సహాయం
రఫా సరిహద్దు సమీపంలో ఉన్న సైనికులు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడంలో బిజీగా ఉన్నారు. డజన్ల కొద్దీ సైనికులు భుజం భుజం కలిపి నిలబడి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ కదన రంగంలో ముందుకు సాగుతున్నారు. ఇజ్రాయెల్ గాజా సరిహద్దులోని తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఇజ్రాయెల్ సైనికులు సర్వశక్తులు ఒడ్డి సిద్ధంగా ఉంటే.. సామాన్య ప్రజలు కూడా సైనికులకు సాయం చేయడంలో వెనుకంజ వేయడం లేదు. వందలాది మంది సైనికులు కాసేపు విశ్రాంతి తీసుకుని, ఆహారం తిని, నిత్యావసర వస్తువులు తీసుకుని ముందువైపు తిరిగి వెళ్లే చోట స్థానికులు సైనికుల కోసం శిబిరాలు ఏర్పాటు చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..