చిన్నారి‘చిప్స్ ప్యాకెట్’ దొంగిలించిన నేరం.. అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు.. వీడియో వైరల్
ఆ పిల్లవాడి ముఖంలో భయం చూశానని, అందుకే పోలీసులతో అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పాడు. పిల్లలతో మాట్లాడే పద్ధతి ఉందని, దానిని పోలీసులు పాటించలేదన్నారు. అతని పట్ల పోలీసుల ప్రవర్తన పూర్తిగా దారుణంగా ఉందన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చాలా పాతదని తెలిసింది. కానీ, ప్రస్తుతం మరోమారు ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మీరు చాలా రకాల దొంగతనాలకు సంబంధించిన సంఘటనలు, వీడియోలు చూసే ఉంటారు. ఇటీవలి కాలంలో దొంగతనాలు పెరిగిపోయాయి. దొంగలు సైతం రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త పంథాలో చోరీలకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలు సర్వసాధారణం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ప్రస్తుత కాలంలో పిల్లలు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. అయినప్పటికీ, వారు దొంగిలించే చాలా వస్తువులు చదువు, ఆటలు, ఆహారానికి సంబంధించినవే ఉంటున్నాయి. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అందులో ఒక పోలీసు దొంగతనం చేసినందుకు ఒక పిల్లవాడిని అరెస్టు చేస్తున్నాడు. పట్టుకున్నప్పుడు, పిల్లవాడు బిగ్గరగా ఏడవడం ప్రారంభిస్తాడు. అయినప్పటికీ పోలీసులు అతన్ని పట్టుకుని తీసుకువెళ్లటం కనిపించింది.
ఈ ఘటన న్యూయార్క్‌లోని సిరక్యూస్‌లో చోటుచేసుకుంది. వైరల్ అవుతున్న వీడియోలో, ఒక పోలీసు చిన్నారిని పట్టుకుని పెట్రోలింగ్ కారులో కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఆ చిన్నారి గట్టిగా ఏడుస్తున్నాడు.. ఇంతకీ ఆ బుడ్డొడు చేసిన చోరీ ఎంటంటే.. సమీపంలోని దుకాణంలో చిప్స్ ప్యాకెట్ దొంగిలించాడని చిన్నారిపై ఆరోపణలు వచ్చాయి. పోలీసులు చిన్నారిని తీసుకెళ్తుండగా కెన్నెత్ జాక్సన్ అనే వ్యక్తి వీడియో తీసి ఇంటర్నెట్‌లో వైరల్ చేశాడు. చిన్నారి అరెస్టును నిరసిస్తూ ఆ వ్యక్తి నిరసనకు దిగాడు.
కెన్నెత్ జాక్సన్ వీడియోలో పోలీసుతో మాట్లాడుతూ..”మీరంతా ఏమి చేస్తున్నారు? మీరు పిల్లవాడిని ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు?” అంటూ నిలదీశాడు.. అందుకు సమాధానంగా మరో పోలీసు స్పందించాడు.. ఈ పిల్లవాడు వస్తువులు దొంగిలిస్తున్నాడని చెప్పాడు. కెన్నెత్ పోలీసులను అడ్డుకుని, లేదు, అతను కేవలం ఒక చిప్స్ ప్యాకెట్ మాత్రమే దొంగిలించాడని,.. మీరందరూ అతని పట్ల ఇంత క్రూరంగా, అతను ఒక హంతకుడులా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డాడు. ఈ 4 నిమిషాల వీడియోలో కెన్నెత్ పోలీసు అధికారులను నిలదీయటం కనిపిందిచంది. దీంతో అక్కడ కాసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వీడియో వైరల్‌గా మారింది.
Cops really arrested the kid over a $2 bag of chips💀 pic.twitter.com/wchHXy46ci
— Insane Reality Leaks (@InsaneRealitys) October 16, 2023
కెన్నెత్ జాక్సన్ మాట్లాడుతూ, ఆ పిల్లవాడి ముఖంలో భయం చూశానని, అందుకే పోలీసులతో అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పాడు. పిల్లలతో మాట్లాడే పద్ధతి ఉందని, దానిని పోలీసులు పాటించలేదన్నారు. అతని పట్ల పోలీసుల ప్రవర్తన పూర్తిగా దారుణంగా ఉందన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చాలా పాతదని తెలిసింది. కానీ, ప్రస్తుతం మరోమారు ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..