Gold Silver Price on Oct 17th: బంగారం కొనేవారికి స్వల్ప ఊరట.. ఇవాళ్టి ధరలు ఇవే.. తులం గోల్డ్ ఎంతుందంటే?

గత రెండు వారాలుగా బంగారం మార్కెట్‌లో భారీ హెచ్చు తగ్గులు కనిపించాయి. ఆశ్చర్యకరంగా ఈ రోజు బంగారం ధర తగ్గింది. సెప్టెంబర్‌లో భారీ పతనాన్ని చూసిన బంగారం ధర అక్టోబర్‌లో నిరంతరం పెరిగింది. డాలర్ ఇండెక్స్ క్షీణించడం కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమైంది. ప్రస్తుత బంగారం, వెండి ధరలను ఇక్కడ తెలుసుకుందాం. ఈ రోజు భారతదేశంలో బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు..

Gold Silver Price on Oct 17th: బంగారం కొనేవారికి స్వల్ప ఊరట.. ఇవాళ్టి ధరలు ఇవే.. తులం గోల్డ్ ఎంతుందంటే?
Gold
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 17, 2023 | 7:19 AM

ఇజ్రాయెల్-హమాస్ వివాదం తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరుగుతోంది. ఈ వివాదం మరిన్ని ప్రాంతాలకు పాకుతుందన్న ఆందోళనే బంగారం ధర పెరగడానికి కారణమని అంచనా వేస్తున్నారు నిపుణులు. గత రెండు వారాలుగా బంగారం మార్కెట్‌లో భారీ హెచ్చు తగ్గులు కనిపించాయి. ఆశ్చర్యకరంగా ఈ రోజు బంగారం ధర తగ్గింది. సెప్టెంబర్‌లో భారీ పతనాన్ని చూసిన బంగారం ధర అక్టోబర్‌లో నిరంతరం పెరిగింది. డాలర్ ఇండెక్స్ క్షీణించడం కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమైంది. ప్రస్తుత బంగారం, వెండి ధరలను ఇక్కడ తెలుసుకుందాం. ఈ రోజు భారతదేశంలో బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 5,510లు పలుకుతుండగా, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 6,011లుగా ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధరల వివరాలను పరిశీలించినట్టయితే.. హైదరాబాద్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 60,110 పలుకుతుండగా.. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్స్ 55,100 పలుకుతోంది. వరంగల్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 60,110 పలుకుతుండగా.. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్స్ 55,100 పలుకుతోంది. అటు, ఏపీలోని విజయవాడలోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్స్) ధర రూ. 60,110 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ. 55,100 ఉంది. విశాఖపట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 60,110, 22 క్యారెట్స్ 10 గోల్డ్ ప్రైజ్ రూ. 55,100 పలుకుతోంది.

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 55,250లుగా ఉంది. 24 క్యారెట్స్‌ 10 గ్రాముల గొల్డ్‌ ధర రూ. 60,260గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్స్ 11 గ్రాముల గోల్డ్ ధర రూ. 55,100లుగా ఉంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 60,110 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55,100 ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 60,110లుగా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,100లుగా ఉంది. 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 60,110లుగా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,300 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60,330గా ఉంది. పూణెలో 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధరూ. 55,100లు ఉండగా, 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 60,110లుగా ఉంది.

ఇవి కూడా చదవండి

బంగారం ధర కాస్త దిగివస్తే.. వెండి మాత్రం కొన్ని చోట్ల పెరిగింది. మరికొన్ని చోట్ల స్థిరంగా ఉంది. దేశీయ మార్కెట్‌లో వెండి ధరలు ఇలా ఉన్నాయి..

పుత్తడి పరుగులు పెడుతుంటే.. వెండి స్థిరంగా ఉంది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 74,100 వద్ద ట్రేడ్ అవుతోంది. కొన్నిచోట్ల మినహా దేశంలోని ప్రధాన నగరాన్నింటిలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 77,500 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో ఇదే ధరలకు వెండి లభిస్తోంది. ఢిల్లీలో రూ. 74,100, ముంబైలో రూ. 74,100, బెంగళూరులో రూ. 73,000, కోల్‌కతా రూ. 74,100, చెన్నైలో రూ. 77,500 గా ఉంది.

అయితే, ఇజ్రాయెల్-హమాస్ వివాదం అంతర్జాతీయ మార్కెట్‌లో అనూహ్య పరిస్థితిని సృష్టిస్తోంది. అదే సమయంలో, బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు తక్కువ ధరల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బెటర్ అంటున్నారు నిపుణులు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..