Business: పండగ సీజన్ సేల్‌లో భిన్నమైన ట్రెండ్.. మెట్రో నగరాలను తలదన్నేలా..
షాపింగ్‌లో మెట్రో నగరాలను చిన్న నగరాలు అధిగించడం విశేషం. ప్రముఖ వార్త సంస్థ పీటీఐ చేపట్టి సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వంటి ఈ-కామర్స్ కంపెనీలు చిన్న నగరాల నుండి ఎక్కువ ఆర్డర్స్‌ను పొందుతుండడం విశేషం. మీషో ఇప్పటి వరకు టైర్2తో పాటు చిన్న నగరాల నుంచి ఏకంగా 80శాతం ఆర్డర్‌లను పొందాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో...
ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ నడుస్తోంది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో బిజినెస్ జోరందుకుంది. ఆఫ్‌లైన్ షాపింగ్ మొదలు ఆన్‌లైన్ షాపింగ్స్ చేస్తున్నార. ఈ కామర్స్ సైట్స్ సేల్స్ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించాయి. అయితే ఈ ఏడాది బిజినెస్ భిన్నమైన ట్రెండ్ కనిపిస్తోంది. సాధారణంగా మెట్రో నగరాల్లో ఎక్కువగా వ్యాపారం జరుగుతుంటుంది. అయితే ఈసారి మాత్రం చిన్న నగరాల్లో ఎక్కువ బిజినెస్ జరుగుతున్నట్లు ట్రెండ్ చెప్తోంది.
షాపింగ్‌లో మెట్రో నగరాలను చిన్న నగరాలు అధిగించడం విశేషం. ప్రముఖ వార్త సంస్థ పీటీఐ చేపట్టి సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వంటి ఈ-కామర్స్ కంపెనీలు చిన్న నగరాల నుండి ఎక్కువ ఆర్డర్స్‌ను పొందుతుండడం విశేషం. మీషో ఇప్పటి వరకు టైర్2తో పాటు చిన్న నగరాల నుంచి ఏకంగా 80శాతం ఆర్డర్‌లను పొందాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో మొదటి రోజు ఫ్లిప్ కార్ట్ నాన్ మెట్రో నగరాల నుంచి 60 శాతానికిపైగా ఆర్డర్‌లు వచ్చాయి.
ఈ ఏడాది బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో మొదటి రోజు 60 శాతానికి పైగా ఆర్డర్లు టైర్-1, టైర్-2, టైర్-3 నగరాల నుంచి వచ్చినట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొన్నట్లు నివేదిక పేర్కొంది. అమెజాన్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అమెజాన్ తన గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ ప్రారంభ రోజులలో నాన్-మెట్రో నగరాల నుండి 80 శాతానికి పైగా ఆర్డర్లు వచ్చాయని తెలిపింది.
ఇక ఈ-కామర్స్ కంపెనీలకు ఈ ఏడాది పండగ సీజన్ విక్రయాల్లో కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. నివేదిక ప్రకారం, బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో మొదటి రోజున ఫ్లిప్‌కార్ట్‌ను 9.1 కోట్ల మంది సందర్శించారు . మొదటి 48 గంటల్లో 9.5 మిలియన్ల కస్టమర్లు తమ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేశారని అమెజాన్ తెలిపింది. చాలా మంది కస్టమర్లు మొబైల్ ఫోన్ ద్వారానే వెబ్‌సైట్స్‌ను చూసినట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఇక ఈ పండగ సీజన్‌లో ప్రజలు పెద్ద సంఖ్యలో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. Amazon ప్రకారం వన్‌ప్లస్, సామ్‌సంగ్, యాపిల్ వంటి బ్రాండ్స్ ఎక్కువ అమ్ముడుపోయినట్లు తెలిపింది. సేల్ మొదలైన మొదటి 48 గంటల్లో ప్రతి నిమిషానికి 100 కంటే క్కువ వన్‌ప్లస్ ఫోన్‌ను అమ్ముడు పోయాయి.
స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, వినియోగదారులు స్మార్ట్‌వాచ్‌లు, పెద్ద స్క్రీన్ టీవీలు, ఎలక్ట్రానిక్స్, లైఫ్‌స్టైల్, బ్యూటీతో పాటు సాధారణ వస్తువుల వంటి ఉత్పత్తులను పండుగ సీజన్ సేల్‌లో కొనుగోలు చేస్తున్నారు. చీరలు, వాచ్‌లు, బ్లూటూత్ హెడ్‌ఫోన్‌లు, బొమ్మలు మొదలైనవి అత్యధికంగా అమ్ముడవుతున్న ఉత్పత్తుల జాబితాలో ఉన్నాయి. ఈ ఏడాది పండుగ సీజన్‌లో ఈ కామర్స్ సైట్స్ అమ్మకాలు రూ. 40 వేల కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..