- Telugu News Photo Gallery Business photos Best business ideas investment with just 10k Telugu Business News
అబ్బా.. ఉద్యోగం ఎన్ని రోజులనే భావనలో ఉన్నారా.? రూ. 10వేల పెట్టుబడితో..
ఉద్యోగం చేసే వారిలో చాలా మంది ఏదో ఒక రోజు వ్యాపారం చేయాలనే ఆశతోనే ఉంటారు. అయితే పెట్టుబడి భయంతో వెనుకడుగు వేస్తుంటారు. అయితే తక్కువ పెట్టుబడితో కూడా చేసుకునే వ్యాపారాలు ఉన్నాయని మీకు తెలుసా.? అంతేకాదండోయే మీరు ఇప్పటికే చేస్తున్న ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పార్ట్ టైమ్‌గా బిజినెస్ చేసుకోవచ్చు. అలాంటి కొన్ని బెస్ట్ వ్యాపార ఐడియాలు మీకోసం...
Updated on: Oct 19, 2023 | 12:22 PM

ఈ డిజిటల్ యుగంలో బిజినెస్ చేయాలంటే దుకాణాలను తెరవాల్సిన అసవరం కూడా లేదు. ఇంట్లో ఉన్న చోటే వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది. ఇంట్లో ఉండే ఎంచక్కా ఆన్‌లైన్‌లో వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది.

ఇలా కేవలం రూ. 10 వేల పెట్టుబడితో వ్యాపారాలు ప్రారంభించుకునే అవకాశం ఉంది. ఈ బడ్జెట్‌లో బెస్ట్ బిజినెస్ ఐడియాల్లో పచ్చళ్ల వ్యాపారాన్ని ప్రారంభించవ్చు. తక్కువ ఖర్చుతో పచ్చళ్లు తయారు చేసుకొని ఆన్‌లైన్‌లో అమ్ముకునే అవకాశం ఉంది.

పెద్దగా నష్టాలు లేని వ్యాపారాల్లో ఫుడ్ బిజినెస్ ఒకటి. మరీ ముఖ్యంగా టిఫిన్స్‌ను తక్కువ ధరలోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని టిఫిన్‌లను తయారు చేసి హోం డెలివరీ చేసే అవకాశం ఉంటుంది.

తక్కువ ఖర్చులో బెస్ట్ బిజినెస్ ప్లాన్స్‌లో ఫొటోగ్రఫీ ఒకటి. పెళ్లిళ్లు, ఫంక్షన్స్‌లో ఫొటోలకు ప్రాధాన్యత ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఓ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌లకు డిమాండ్ పెరుగుతుంది. మంచి డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరా ఉంటే చాలు ఫొటోగ్రఫీ నుంచి ఆదాయం పొందొచ్చు.

యూట్యూబ్ ద్వారా కూడా ఆదాయం ఆర్జిస్తోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈక్రమంలోనే యూట్యూబ్‌లో యోగా క్లాసెస్ చెప్పడం ద్వారా డబ్బులను సంపాదించొచ్చు. ప్రస్తుతం ఉన్న ఒత్తిడితో కూడుకున్న జీవితాల కారణంగా ప్రాణాయామం, యోగా వంటి వాటికి ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.




