Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

watch viral video: పెంపుడు కుక్కను ఎత్తుకెళ్లిన కంగారు.. ప్రాణాలకు తెగించి రక్షించిన యజమాని.. వీడియో హల్‌చల్‌

మరోవైపు తన ప్రాణాలను కాపాడుకున్న కుక్క బతుకు జీవుడా అనుకుంటూ.. అక్కడి నుంచి పారిపోయింది. అప్పుడు కూడా కంగారు ఛాతీని పైకి లేపి నిలబడి మోలోనిని చూస్తూనే ఉంది. కంగారూ మోలోనీని పట్టుకోవాలని పదే పదే ప్రయత్నించినా కుదరలేదు. చేసేది లేక కంగారు మోలోనీ ముఖం వైపు చూస్తూ ఉండిపోతుంది. మోలోనీ నీటి నుండి బయటకు వచ్చేశాడు. ఈ వీడియో చూసిన తర్వాత,..

watch viral video: పెంపుడు కుక్కను ఎత్తుకెళ్లిన కంగారు.. ప్రాణాలకు తెగించి రక్షించిన యజమాని.. వీడియో హల్‌చల్‌
Heroic Dog Rescue
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 17, 2023 | 8:40 AM

ఆస్ట్రేలియాకు వెళ్లే చాలా మంది వ్యక్తులు సాలెపురుగులు, పాములతో సహా అనేక ప్రమాదకరమైన జీవులకు భయపడతారు. ఎందుకంటే అక్కడి నివాస ప్రాంతాలలో ఇలాంటి జీవులు విచ్చలవిడిగా సంచరిస్తూ విరివిగా కనిపిస్తాయి. ఇవి కాకుండా, ఇక్కడి ప్రజలను భయపెట్టేందుకు అనేక ఇతర జంతువులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా నుండి మరోసారి ఆశ్చర్యకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో కంగారు తన గోళ్లతో కుక్కను పట్టుకుని ఈడ్చుకెళ్లటం కనిపిస్తుంది. కంగారు పంజా నుండి తప్పించుకోలేక ఆ కుక్క నిస్సహాయంగా ఉండిపోతుంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. రెండు మీటర్ల పొడవున్న కంగారూ..ఒక కుక్కను చెరువులోకి ఈడ్చుకెళ్లింది..కుక్క ఏరకంగానూ తప్పించుకునే అవకాశం లేకుండా.. గట్టిగా పట్టుకుంది.. ఈ కుక్క మిక్ మోలోనీ అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క అని తెలిసింది. అతను తన కుక్కను ముర్రే నది ఒడ్డున వాకింగ్‌ కోసం తీసుకువచ్చాడు. అయితే, తన కుక్క అకస్మాత్తుగా అదృశ్యమవుతుందని అతనికి తెలియదు. మోలోనీ తన కుక్క కోసం చాలా సేపు వెతికినా ఎక్కడా కనిపించలేదు. అయితే, చాలా సమయం తర్వాత అతను కంగారు బారిలో చిక్కుకున్న తన కుక్కను చూశాడు. దాంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కంగారూ కుక్కను దారుణంగా పట్టుకుంది.

ఇవి కూడా చదవండి

పెంపుడు కుక్క యజమాని మోలోని కంగారూ బారి నుండి తన కుక్కను ఎలాగైనా విడిపించాలనుకున్నాడు. అతడు తన కుక్క కోసం చూస్తుండగా.. అది అతన్నే చూస్తూ ఉండటం గమనించాడు. అప్పటికే ఆ కంగారూ కుక్కను నీటిలో సగానికి ముంచేసింది. తన కుక్కను రక్షించడానికి, మోలోనీ ఏ మాత్రం ఆలోచించకుండా నీటిలోకి వెళ్లిపోయాడు.. తన చేతిలో కెమెరాతో ఇదంతా షూట్‌ చేస్తూనే.. అతను కంగారు దగ్గరికి వెళ్లి కుక్కను కంగారు బారి నుండి విడిపించాడు. దాంతో కంగారు కోపం తెచ్చుకుని మోలోనీపై దాడికి దిగింది. ఇరువురి దాడి క్రమంలో అతని కెమెరా నీటిలో పడిపోతుంది. కానీ, ఎలాగోలా మోలోనీ నీటి నుండి కెమెరాను బయటకు తీసుకున్నాడు. మరోవైపు తన ప్రాణాలను కాపాడుకున్న కుక్క బతుకు జీవుడా అనుకుంటూ.. అక్కడి నుంచి పారిపోయింది. అప్పుడు కూడా కంగారు ఛాతీని పైకి లేపి నిలబడి మోలోనిని చూస్తూనే ఉంది. కంగారూ మోలోనీని పట్టుకోవాలని పదే పదే ప్రయత్నించినా కుదరలేదు. చేసేది లేక కంగారు మోలోనీ ముఖం వైపు చూస్తూ ఉండిపోతుంది. మోలోనీ నీటి నుండి బయటకు వచ్చేశాడు. ఈ వీడియో చూసిన తర్వాత, చాలా మంది తన కుక్క ప్రాణాలను ధైర్యంగా రక్షించినందుకు మోలోనీని ప్రశంసించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..