Viral News: ఈ వ్యక్తికి ఆడవారంటే భయం.. ఇంటి నుంచి 55 ఏళ్లుగా బయటకు రాలేదు.. ఇంటి చుట్టూ 15 అడుగుల ఎత్తైన కంచె

ఆడవాళ్ళంటే తనకు దెయ్యంతో సమానం అన్న విధంగా భయపడుతున్న ఒక గురించి ఈ రోజు తెలుసుకుందాం.. ఆ వ్యక్తి 55 ఏళ్లుగా ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. అతను మహిళలకు దూరంగా గడుపుతున్నట్లు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సమయంలో  అతను ఒంటరిగా మహిళలతో మాట్లాడటం కానీ.. మహిళతో గడపడం కానీ ఇప్పటి వరకూ ఎవరూ చూడలేదని అంటున్నారు. 

Viral News: ఈ వ్యక్తికి ఆడవారంటే భయం.. ఇంటి నుంచి 55 ఏళ్లుగా బయటకు రాలేదు.. ఇంటి చుట్టూ 15 అడుగుల ఎత్తైన కంచె
Callitxe Nzamwita
Follow us
Surya Kala

|

Updated on: Oct 14, 2023 | 8:50 AM

కొందరు చిన్న చిన్న విషయాలకే భయపడతారు. మరికొందరు దెయ్యం వంటి వాటి గురించి వింటే భయపడతారు. ఇంకొందరు కౄర మైన జంతువులను చూసి భయపడతారు.. అయితే ఎప్పుడైనా  ఆడవాళ్ళంటేనే భయపడే వ్యక్తి గురించి విన్నారా? అవును ఆడవాళ్ళంటే తనకు దెయ్యంతో సమానం అన్న విధంగా భయపడుతున్న ఒక గురించి ఈ రోజు తెలుసుకుందాం.. ఆ వ్యక్తి  55 ఏళ్లుగా ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. అతను మహిళలకు దూరంగా గడుపుతున్నట్లు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సమయంలో  అతను ఒంటరిగా మహిళలతో మాట్లాడటం కానీ.. మహిళతో గడపడం కానీ ఇప్పటి వరకూ ఎవరూ చూడలేదని అంటున్నారు.

ఆ వ్యక్తి తన ఇంటి చుట్టూ 15 అడుగుల ఎత్తైన కంచెను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ వింతైన వ్యక్తి పేరు కాలిటెక్స్‌ నజాంవిటా (Callitxe Nzamwita). డైలీ స్టార్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఆ వ్యక్తి వయస్సు 71 సంవత్సరాలు. ఆడవాళ్ళంటే భయంతో 55 ఏళ్లుగా తన ఇంటికి తాళం వేసి ఆడవాళ్ళకే కాదు పురుషులకు కూడా దూరంగా ఉంటున్నాడు. అయినప్పటి.. అతని  ఇంటి చుట్టుపక్కల నివసించే మహిళలు కాలిటెక్స్‌ జీవించడానికి సహాయం చేసారు. ఇప్పటికీ అలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు.

స్త్రీల వైపు కూడా చూడడు

నిజానికి, కాలిటెక్స్‌కు సహాయం చేయకపోతే అతను చనిపోతాడని ఇరుగు పొరుగుతున్న మహిళలు భావిస్తున్నారు. అందుకే తనని తాను ఇంట్లో బంధించుకున్న అతనికి కిరాణా సామాను తెచ్చియిస్తారు. అయితే అతను తన దగ్గరికి కూడా ఆడవాళ్ళను అనుమతించకపోవడంతో.. వారు బయటి నుండి కిరాణా సామాను అతని ఇంట్లోకి విసిరివేస్తారు. ఆ తర్వాత కాలిటెక్స్‌ సామాన్లు తీసుకుని ఇంటి లోపలికి వెళ్తాడు. నివేదికల ప్రకారం అతను తన ఇంటి వైపు వెళ్తున్న ఏ మహిళను చూసినా సరే వెంటనే ఇంటిలోపలికి వెళ్లి తాళం వేసుకుంటాడు. ఇలా ఆడవారిని చూసి కాలిటెక్స్‌ భయపడడానికి గల కారణం అతను “గైనోఫోబియా” తో బాధపడుతున్నాడని తెలుస్తోంది. ఈ వ్యాధితో బాధపడే వారి మనసులో స్త్రీలంటే భయం ఉంటుంది. అందుకే వారితో మాట్లాడరు. అసలు ఆడవారిని చూడడానికి కూడా ఇష్టపడరు.

ఇవి కూడా చదవండి

స్త్రీలను చూస్తే అనేక శారీరక సమస్యలు

నివేదికల ప్రకారం కేవలం మహిళల గురించి ఆలోచిస్తే చాలు కాలిటెక్స్‌కు తీవ్రమైన సమస్యలతో బాధపడతాడు. కనీసం ఊపిరి కూడా తీసుకోవడానికి ఇబ్బంది పడతాడు. భయాందోళనలు, ఛాతీ బిగుతు, విపరీతమైన చెమట, వేగవంతమైన హృదయ స్పందన, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది బారిన పడతాడు.  ఇవన్నీ గైనోఫోబియా సాధ్యమైన లక్షణాలుగా వైద్య నిపుణులు అభివర్ణిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?