Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీ చేరుకున్న సెకండ్ బ్యాచ్.. 235 మంది భారతీయులు రాక

ఇజ్రాయిల్ నుండి భారతీయ పౌరులను తిరిగి తీసుకుని వస్తున్న ఎయిర్ ఇండియా రెండవ విమానం శుక్రవారం సాయంత్రం 5.35 గంటలకు టెల్ అవీవ్ నుండి బయలుదేరింది. ఈ విమానం శనివారం ఉదయం 6 గంటలకు ఢిల్లీకి చేరుకుంది. దాదాపు 18,000 మంది భారతీయులు ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయారు. భారత ప్రభుత్వం బుధవారం 'ఆపరేషన్ అజయ్' ప్రారంభించింది.

Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీ చేరుకున్న సెకండ్ బ్యాచ్.. 235 మంది భారతీయులు రాక
Israel Palestine Conflict
Follow us

|

Updated on: Oct 14, 2023 | 12:54 PM

ఇజ్రాయిల్ – హమాస్‌ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇజ్రాయిల్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించే ప్రక్రియ కొనసాగుతోంది. 212 మంది భారతీయ పౌరులతో కూడిన మొదటి బ్యాచ్ శుక్రవారం భారతదేశానికి చేరుకుంది. అలాగే రెండో విమానంలో 235 మంది భారతీయులు టెల్ అవీవ్ నుండి  బయలుదేరి ఈరోజు ఉదయం 6 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు.

ఇజ్రాయిల్ నుండి  235 మంది భారతీయ పౌరులను తిరిగి తీసుకుని వస్తున్న ఎయిర్ ఇండియా రెండవ విమానం శుక్రవారం సాయంత్రం 5.35 గంటలకు టెల్ అవీవ్ నుండి బయలుదేరింది. అదే సమయంలో ఈ విమానం ఈరోజు ఉదయం 6 గంటలకు ఢిల్లీకి చేరుకుంది. దాదాపు 18,000 మంది భారతీయులు ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయారు. భారత ప్రభుత్వం బుధవారం ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. భారత పౌరుల భద్రతకు కట్టుబడి ఉన్నామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.

ఇవి కూడా చదవండి

టెల్ అవీవ్ నుండి బయలుదేరిన రెండవ బ్యాచ్

212 మంది పౌరులతో కూడిన మొదటి బ్యాచ్

మొదటి బ్యాచ్ 212 మంది పౌరులు శుక్రవారం ఉదయం చార్టర్డ్ విమానం ద్వారా భారతదేశానికి చేరుకున్నారన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయిల్ నుండి భారతీయ పౌరులు తిరిగి రావడానికి మొదటి విమానం గురువారం సాయంత్రం 212 మందితో బెన్ గురియన్ విమానాశ్రయం నుండి బయలుదేరి శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. ఇలా స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయులకు సంబంధించిన ఖర్చులను భారత ప్రభుత్వం భరిస్తుంది. ఇజ్రాయిల్‌లో ప్రస్తుతం 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం తెలిపారు.

ఇజ్రాయిల్, హమాస్ మధ్య 7 రోజులుగా కొనసాగుతున్న యుద్ధం

గత శనివారం ఉదయం హమాస్ అకస్మాత్తుగా ఇజ్రాయిల్‌పై దాడి చేసి బీభత్సం సృష్టించింది. హమాస్ యోధులు ఇజ్రాయిల్‌పై 5000కు పైగా రాకెట్లను ప్రయోగించారు. ఈ దాడిలో 1300 మందికి పైగా ఇజ్రాయిల్ ప్రజలు మరణించగా వేలాది మంది గాయపడ్డారు. ఈ దాడి తరువాత ఇజ్రాయిల్ కూడా ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంది. ఇందులో వందలాది మంది హమాస్ ప్రజలు మరణించారు. వేలాది మంది ప్రజలు గాయపడ్డారు. గత ఏడు రోజులుగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం నడుస్తోంది. హమాస్‌పై ఇజ్రాయిల్ నిరంతరం దాడులు చేస్తోంది. దాదాపు 3 లక్షల మంది ఇజ్రాయిల్ సైనికులు గాజా స్ట్రిప్‌లో మోహరించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ