Afghanistan Bomb Blast: జమాన్ మసీదులో నమాజ్ చేస్తుండగా బాంబు పేలుడు, 15 మంది మృతి, అనేక మందికి గాయాలు

ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే అనేక ఇబ్బంది పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఈ బాంబు పేలుడు ఘటనతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దేశంలో పరిస్థితి పూర్తిగా క్లిష్టంగా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో.. బాంబ్ పేలుడుతో రెడ్ కార్పెట్ నేలపై శిధిలాలు, ఇతర వస్తువులు చెల్లాచెదురుగా ఉన్నాయి. రక్తసిక్తమైన శరీరాలు కనిపిస్తున్నాయి.

Afghanistan Bomb Blast: జమాన్ మసీదులో నమాజ్ చేస్తుండగా బాంబు పేలుడు, 15 మంది మృతి, అనేక మందికి గాయాలు
Afghanistan, Bomb Blast
Follow us
Surya Kala

|

Updated on: Oct 14, 2023 | 7:21 AM

ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఓ వైపు భూకంపం కారణంగా విధ్వంసం, మరోవైపు బాంబు పేలుళ్లతో భయానక వాతావరణం నెలకొంది. ఆఫ్ఘనిస్థాన్‌లోని జమాన్ మసీదులో జరిగిన బాంబు పేలుళ్లలో 15 మంది మరణించగా, పలువురు గాయపడినట్లు సమాచారం. పేలుడు సంభవించిన సమయంలో జమాన్ మసీదులో అనేక మంది నమాజ్ చేస్తున్నారు.

బాంబు పేలుడు ఘటనతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఇది ఆత్మాహుతి దాడి అని చెబుతున్నారు. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని బగ్లాన్ ప్రావిన్స్ రాజధాని పులే ఖోమ్రీలో ఉన్న ఈ ఇమామ్ జమాన్ మసీదు షియా వర్గానికి చెందినదిగా చెప్పబడుతుంది. షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగింది.

సమాచారం ప్రకారం బాంబ్ పేలుళ్లతో మసీదు పరిసర ప్రాంతాల్లో చాలా నష్టం జరిగినట్లు సమాచారం. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకూ తామే కారణం అంటూ ఈ దాడికి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. అయితే దీని వెనుక ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) సంస్థ హస్తం ఉందనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఉగ్రవాద సంస్థ ఇంతకు ముందు ఆఫ్ఘనిస్థాన్‌లోని మైనారిటీ షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున దాడులు చేసింది.

ఇవి కూడా చదవండి

తాలిబాన్ల ఆక్రమణ తర్వాత మసీదులపై పెరిగిన దాడులు

ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే అనేక ఇబ్బంది పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఈ బాంబు పేలుడు ఘటనతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దేశంలో పరిస్థితి పూర్తిగా క్లిష్టంగా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో.. బాంబ్ పేలుడుతో రెడ్ కార్పెట్ నేలపై శిధిలాలు, ఇతర వస్తువులు చెల్లాచెదురుగా ఉన్నాయి. రక్తసిక్తమైన శరీరాలు కనిపిస్తున్నాయి. 2021లో తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న  తర్వాత దేశవ్యాప్తంగా మసీదులు,  మైనారిటీలపై జరుగుతున్న దాడులు పెరుగుతూనే ఉన్నాయి. దేశ పరిస్థితి అధ్వాన్నంగా మారింది.

భూకంపంలో 2500 మందికి పైగా మృతి

శనివారం హెరాత్‌లో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా వేలాది మంది గాయపడ్డారు. ఈ శక్తివంతమైన భూకంపం కారణంగా చాలా గ్రామాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..