Solar Eclipse 2023: నేడు శని అమావాస్య, సూర్యగ్రహణం.. శనీశ్వరుడు అనుగ్రహం కోసం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తెలుసుకోండి..
నేడు సర్వ పితృ అమావాస్య .. శనివారం కావడంతో శని అమావాస్య కూడా.. హిందువులు శని అమావాస్యన పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు చేసే దానధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందుచేత ఈరోజు పేదలకు వీలైనంత సహాయం చేయండి. ఆకలి అన్నవారికి ఆహారాన్ని అందించండి. అంతేకాదు శని అమావాస్య నేపథ్యంలో ఈ రోజు శనీశ్వరుడుని ప్రసన్నం చేసుకోవడానికి శనీశ్వరుడికి సంబంధించిన వస్తువులను కూడా దానం చేయవచ్చు.
హిందూ మతంలో గ్రహణం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. గ్రహణం జీవితాలపై శుభా అశుభ ఫలితాలను ఇస్తుంది. నేడు సూర్యగ్రహణం..ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం ఏర్పడనుంది. అంతే కాదు నేడు సర్వ పితృ అమావాస్య .. శనివారం కావడంతో శని అమావాస్య కూడా.. హిందువులు శని అమావాస్యన పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు చేసే దానధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందుచేత ఈరోజు పేదలకు వీలైనంత సహాయం చేయండి. ఆకలి అన్నవారికి ఆహారాన్ని అందించండి. అంతేకాదు శని అమావాస్య నేపథ్యంలో ఈ రోజు శనీశ్వరుడుని ప్రసన్నం చేసుకోవడానికి శనీశ్వరుడికి సంబంధించిన వస్తువులను కూడా దానం చేయవచ్చు. అయితే కొన్ని పనులు చేయకూడదు.
ఏ పనులు చేయకూదంటే..
- ఈ రోజున తులసి మొక్కను పూజించకండి. అంతేకాదు తులసి ఆకులను కోయవద్దు. ఇలా చేయడం వలన లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉంది.
- సూర్యగ్రహణం సమయంలో ఇంట్లో ఉండే ఆహార వస్తువులపై దర్భలను వేసి ఉంచండి. అంతేకాదు వండిన ఆహార పదార్ధాలు నిల్వ లేకుండా చూసుకోండి.
- గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు లేదా పదునైన వస్తువులను ఉపయోగించకూడదు.
- అమావాస్య రోజున ప్రతికూల శక్తులు చురుగ్గా ఉంటాయని.. అందుకే ఈ రోజు నిర్జన ప్రదేశాలకు వెళ్లడం మానుకోవాలని ముఖ్యంగా మానసికంగా బలహీనమైన ఉన్నవారు నిర్జల ప్రదేశానికి వెళ్లవద్దని పెద్దలు సూచించారు.
- గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం సరైనది కాదు. గ్రహణానికి ముందు తులసి ఆకులను కలిపిన నీటిని మాత్రమే సేవించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.