నకిలీ లాయర్ ముదురు తెలివితేటలు.. కేసులు వాదించడంలో మహా దిట్ట.. ఏకంగా 26కేసుల్లో..

తనకు అనుమానం రాకుండా వివరాలను తారుమారు చేసి తన ఫొటోను అప్‌లోడ్ చేశాడు. అయితే,.. అసలైన న్యాయవాది ప్రాక్టీసింగ్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేయడానికి సిస్టమ్‌లోకి లాగిన్ అయినప్పుడు నకిలి బ్రియాన్ బయటపడ్డాడు. అతను లాగిన్ కాలేకపోవడంతో తను దాని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నకిలీ లాయర్ ముదురు తెలివితేటలు.. కేసులు వాదించడంలో మహా దిట్ట.. ఏకంగా 26కేసుల్లో..
fake lawyer
Follow us

|

Updated on: Oct 17, 2023 | 11:38 AM

ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒకటి సాధించాలని, పెద్ద పదవులు చేపట్టాలని, ఉన్నతంగా జీవించాలని కోరుకుంటారు..అందుకోసం కష్టపడి చదువుకుంటారు..తాము చేయాలనుకున్న పనిలో పూర్తి శిక్షణ తీసుకుంటారు.. అలా తన తల్లిదండ్రులను గర్వపడేలా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఒక వ్యక్తి ఏదైతే కావాలనుకున్నాడో, దానికి సంబంధించిన కోర్సులో శిక్షణ తీసుకుంటాడు. ఉదాహరణకు, టీచర్ కావాలనుకునే వ్యక్తి టీచింగ్ కోర్సు పూర్తి చేస్తాడు.. ఇంజనీర్ కావాలనుకునే వ్యక్తి ఇంజనీరింగ్‌లో పట్టా సాధిస్తాడు. డాక్టర్ కావాలనుకునే వ్యక్తి MBBSలో చేరి కష్టపడి చదువుకుంటాడు. అదేవిధంగా, లాయర్‌ అనే వ్యక్తి న్యాయవాదానికి సంబంధించిన కోర్సు చేస్తాడు. ఏ డిగ్రీ లేకుండా గౌరవప్రదమైన, అధిక జీతం కలిగిన ఉద్యోగం ఎవరికీ లభించదు. అయితే కెన్యాలో ఓ వ్యక్తి విషయంలో ఇది జరిగింది. ఎలాంటి డిగ్రీ, శిక్షణ లేకుండానే అతడు లాయర్‌ అవతారమెత్తాడు. ఎలాంటి శిక్షణా లేకపోయినప్పటికీ అతడు..26 కేసుల్లో విజయం సాధించడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. ఈ ఘటన గురించి తెలియగానే అందరూ షాక్ అయ్యారు. ఎలాంటి డిగ్రీ, శిక్షణ లేకుండానే అతడు లాయర్‌గా 26 కేసులు ఎలా గెలిచాడంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అయితే, సదరు నకిలీ లాయర్‌.. తను న్యాయవాదిగా గుర్తింపు పొందటం కోసం బ్రియాన్ మ్వెండా అనే అసలైన లాయర్‌ గుర్తింపును దొంగిలించాడు. అతని పేరు బ్రియాన్ మ్వెండా న్ట్వికి దగ్గరా ఉండటంతో ఈజీగా చీట్‌ చేయగలిగాడు. బ్రియాన్ చాకచక్యంగా తమ పోర్టల్‌ను హ్యాక్ చేసి, అతని పేరుకు సరిపోయే వ్యక్తి ప్రొఫైల్ కోసం వెతికాడు..ఈ క్రమంలోనే లాయర్‌ బ్రియాన్‌ను పట్టుకున్నాడు. తనకు అనుమానం రాకుండా వివరాలను తారుమారు చేసి తన ఫొటోను అప్‌లోడ్ చేశాడు. అయితే,.. అసలైన న్యాయవాది ప్రాక్టీసింగ్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేయడానికి సిస్టమ్‌లోకి లాగిన్ అయినప్పుడు నకిలి బ్రియాన్ బయటపడ్డాడు. అతను లాగిన్ కాలేకపోవడంతో తను దాని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ మోసం ఉన్నప్పటికీ, చాలా మంది బ్రియాన్ మ్వెండాకు మద్దతుగా నిలిచారు. ఎలాంటి శిక్షణ లేకుండానే లా ప్రాక్టీస్‌లోకి ప్రవేశించి 26 కేసుల్లో విజయం సాధించాడని, అతని తెలివితేటలను పలువురు కొనియాడారు. బ్రియాన్‌కు చాలా మంది పెద్ద వ్యక్తుల నుండి మద్దతు కూడా లభిస్తోంది. ఈ సపోర్ట్‌తో హ్యాపీగా ఉన్న బ్రియాన్, తనను ఆదరిస్తున్న, తన కోసం ప్రార్థిస్తున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని బ్రియాన్ వీడియోలో తెలిపారు. సరైన సమయం వచ్చినప్పుడు నేను ఈ అపార్థాన్ని తొలగిస్తాను అని చెప్పాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..